AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?

ఆ గ్రామంలో ఓ పురాతన ఆయలం ఉంది. శీతారాములుకొలువై ఉన్న ఈ ఆలయంలో ఉన్న దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. దాన్ని వెలిగించి దాదాపు 700 ఏళ్లు దాటిన ఇంకా ఆ దీపం కొండెక్కలేదు.. ఆ నాటి నుంచి నేటి వరకు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తూనే ఉంది. ఇంతకు ఆ ఆలయం ఎక్కడుందనేగా మీ డౌట్.. అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?
Gambhiraopet Sitaram Temple
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 6:15 PM

Share

అది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయం.. ఈ ఆలంలో స్వామి వారి ముందు ఉన్న నందా అనే దీపం సుమారు 700 ఏళ్లుగా ఆరని దివ్య జ్యోతిగా భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ దీపం కేవలం ఒక వెలుగు కాదు, శతాబ్దాల విశ్వాసానికి నిలువెత్తు ప్రతీకగా అక్కడి భక్తుల నమ్మకం. ఇదే ఆ గ్రామానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. క్రీస్తూ పూర్వం.. 1,314వ సంవత్సంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తోంది.

700 ఏళ్లుగా వెలుగుతున్న దీపం

ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఇక్కడ నందా దీపాన్ని ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి నేటి వరకు ఈ దీపం ఆరకుండా ప్రకాశిస్తూనే ఉందట. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దీపానికి నూనెను సమర్పిస్తూ దాని జ్వాలను ఆరిపోకుండా చూసుకుంటున్నారట.తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందట. గ్రామస్థుల విశ్వాసం ప్రకారం ఈ జ్యోతి వెలుగుతుండటం వల్ల గ్రామంలో ఐశ్వర్యం, పంటలు, శాంతి నిలుస్తాయట. ఇది దైవ అనుగ్రహానికి ప్రత్యక్ష రూపంగా గ్రామస్తులు భావిస్తారు.

కాకతీయుల కళా వైభవం.

ఈ ఆలయం నిర్మాణం కేవలం భక్తి కట్టడం మాత్రమే కాదు. శిల్పకళకు కూడా మహోన్నతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో 16, 18 రాతి స్తంభాలతో అద్భుత మండపాలు, చతురస్రాకార నిర్మాణ శైలి. శిల్పాల్లో కనిపించే నిగూఢమైన నైపుణ్యం. ఈ నిర్మాణం కాకతీయుల కాలపు కళాత్మక ప్రతిభను ప్రతిబింబిస్తూ, చరిత్రను జీవంతంగా నిలబెడుతోంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 9 రోజుల పాటు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు సీతారామ కళ్యాణం.. భద్రాచలం తరహాలో ఘనంగా అశ్వ, గజ, గరుడ, హనుమాన్, శేష వాహన సేవలు.. రథోత్సవం, ఏకాంత సేవ వంటికి జరుపుతారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా హాజరవుతారు.

అన్నదాన కార్యక్రమాలు

ఈ ఉత్సవాల సమయంలో దాతల సహకారంతో నిర్వహించే అన్నదానం ఈ ఆలయ ప్రత్యేకత. గ్రామస్థులు సమిష్టిగా భాగస్వామ్యం వహిస్తూ ప్రతి భక్తునికి సేవ చేయడం ఈ క్షేత్ర ఆధ్యాత్మికతను మరింత పెంచుతోంది. గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా ఆలయం మరింత శోభాయమానంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన