AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

సినీ నటుడు విజయ్‌కు మరో షాక్ తగిలింది. ,ఇటీవలే ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
Thalapathy Vijay Tvk Alliance
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 2:07 PM

Share

తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మార్చి 10న విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది.

అసలు కేసు నేపథ్యం ఏమిటి?

సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు .

ఇప్పటివరకు జరిగిన విచారణ

విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి.  ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో మార్చి 10న విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us