AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandupalyam: ‘దండుపాళ్యం’ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. వీడియో వైరల్

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త ఒరవడి సృష్టించింది దండు పాళ్యం. కర్ణాటకలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Dandupalyam: 'దండుపాళ్యం' సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. వీడియో వైరల్
Dandupalyam Movie
Basha Shek
|

Updated on: Mar 09, 2026 | 7:53 PM

Share

2012లో వచ్చిన దండుపాళ్యం సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కన్నడ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అలాగే రికార్డు సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. కేవలం కన్నడలోనే కాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. క్రైమ్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన దండు పాళ్యం సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. దండుపాళ్యం 2 జూలై 2014లో రిలీజ్ కాగా, ఆ వెంటనే దండు పాళ్యం 3 కూడా రిలీజైంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన దండుపాళ్య 4 2019లో విడుదలైంది. దండు పాళ్యం సినిమా అంటేనే ఒక క్రూరమైన గ్యాంగ్ కళ్ల ముందు మొదులుతుంది. శ్రీనివాస రాజు తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్, రఘు ముఖర్జీ, ప్రియాంక కొఠారి, జయ దేవ్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా దండా పాళ్యం ముఠా నాయకురాలి పాత్రలో లక్ష్మీ అలియాస్ పూజా గాంధీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే ఈ పాత్రలో పూజా అభినయం అందరినీ భయ పెట్టింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో అయితే బోల్డ్ గానూ నటించి మెప్పించిందీ అందాల తార.

దండు పాళ్యం సినిమాలో చాలా మొరటుగా, క్రూరంగా కనిపించిన పూజా గాంధీ నిజ జీవితంలో చాలా అందంగా, హుందాగా ఉంటుంది. పూజా గాంధీ 2001లో హిందీ సినిమా ”ఖత్రోన్ కే ఖిలాడి” సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ముంగారు మగ , మిలనా, కృష్ణ, తాజ్ మహల్, బుద్ధివంత, అను, గోకుల, దండుపాళ్యం, దండుపాళ్యం 2 , దండుపాళ్యం 3 తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. విజయవంతమైన సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించిన పూజ చివరిగా తగ్గేదేలే అనే తెలుగు సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయడం లేదు.

ఇవి కూడా చదవండి

పూజా గాంధీ లేటెస్ట్ వీడియో..

పూజా గాంధీ నవంబర్ 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఏమైందో కానీ కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2023లో పూజా తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త విజయ్ ఘోర్పడేతో కలిసి పెళ్లి పీటలెక్కింది. ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందీ అందాల తార. ఇక సినిమాలకు దూరమైనా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటోంది పూజా. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. తాజాగా పూజా గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈమె దండుడుపాళ్యం హీరోయినేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by MAHETHON (@mahethon_2026)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు
ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా
ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా
వారెవ్వా..ఏం రుచి గురూ..చికెన్ ఫ్రై ఇలా చేస్తే కారంగా అదిరిపోద్దీ
వారెవ్వా..ఏం రుచి గురూ..చికెన్ ఫ్రై ఇలా చేస్తే కారంగా అదిరిపోద్దీ