భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ కోసం వచ్చిన రెండు కుటుంబాలు పోలీసుల ముందే భౌతిక దాడులకు దిగాయి. దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగా, అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. స్టేషన్ ఆవరణ రణరంగంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణ సోమవారం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన రెండు కుటుంబాలు పోలీసుల ముందే రెచ్చిపోయి భౌతిక దాడులకు దిగడంతో తూప్రాన్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ జిల్లా అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి, రాంపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త తనను వేధిస్తున్నాడంటూ జ్యోతి పోలీసులను ఆశ్రయించడంతో, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై జ్యోతి ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగానే దంపతుల మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ సహనం కోల్పోయారు. ఈ క్రమంలో బయట వేచి ఉన్న ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చి పరస్పరం దాడులకు దిగారు. పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా ఒకరినొకరు నెట్టేసుకుంటూ, కొట్టుకోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలను విడదీశారు. స్టేషన్ ఆవరణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇరుపక్షాలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోటల్ చెక్ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు
దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం
ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు
రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

