AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..

క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..

Phani CH
|

Updated on: Mar 11, 2026 | 11:46 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో యూట్యూబర్ హార్దిక్ తన కవల సోదరి హిమ్షిఖాను దారుణంగా హత్య చేశాడు. హోలీ రోజున జరిగిన ఈ ఘటనలో, ప్రేమ విఫలమై, దానిని తల్లీచెల్లెళ్లే కారణమని భావించి వారిపై కక్ష పెంచుకున్న హార్దిక్, హిమ్షిఖాను 40 సార్లు పొడిచాడు. అనంతరం తల్లిపై దాడి చేశాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, హార్దిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం జరిగింది. బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. గురుగ్రామ్ నుంచి హోలీ జరుపుకోవడానికి ఇంటికి వచ్చారు ఈ కవలలు. హిమ్షిఖా-హార్దిక్ మధ్య చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ వంటింట్లోకి వెళ్లి పెద్ద కత్తి తీసుకొని హిమ్షిఖాను 40 సార్లు పొడిచి చంపాడు. తన సోదరిని చంపిన తర్వాత, హార్దిక్ తన తల్లి ఆఫీస్‌కి వెళ్ళాడు. ‘అమ్మా, ఇంటికి రా! నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు. హార్దిక్‌ తల్లి నీలిమా ఇంటికి వచ్చి తలుపు తెరిచి హిమ్షిఖాను చూసి షాక్ తింది. అదే సమయంలో హార్దిక్ తన తల్లిని ఆరు సార్లు కత్తితో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో కత్తి అక్కడే వదిలి హార్దిక్ పారిపోయాడు. గాయపడ్డ నీలిమను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రాణాలతో బయటపడినా, హిమ్షిఖా మాత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు హార్దిక్‌ని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్. పూర్తి చేసిన తర్వాత హార్దిక్ గూగుల్‌లో పనిచేశాడు. ఒక ఏడాది క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబర్‌గా మారాడు. ఉద్యోగం చేసే సమయంలో పూణేకు చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడు నెలల క్రితం ఆ యువతి బ్రేకప్ చెప్పడంతో, హార్దిక్ మానసికంగా కుంగిపోయాడు. తన ప్రేమ విఫలం కావడానికి తల్లీ, చెల్లెలు కారణం అని అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపైనే హోలీ రోజు హిమ్షిఖాతో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు హర్దిక్. హిమ్షిఖా ఒక ఐటీ కంపెనీలు జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..

Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Follow Us