TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..
తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 2025లో జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే రెండుసార్లు విచారణ ఎదుర్కొన్న విజయ్, మార్చి 10న హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు. పార్టీకి సంబంధం లేదన్న విజయ్ వాదనపై అందరి దృష్టి నెలకొంది.
తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మార్చి 10న విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది. అసలు కేసు నేపథ్యం ఏమిటి? సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో మార్చి 10న విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం
ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..
Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం
Dhurandhar 02: ధురంధర్ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్
The Taj Story OTT: తాజ్ మహల్ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

