AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం

Phani CH
|

Updated on: Mar 11, 2026 | 12:04 PM

Share

ప్రధాని మోడీ ఢిల్లీలో దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రారంభించారు. 12.3 కి.మీ మజ్లిస్ పార్క్-బాబర్‌‌పూర్ కారిడార్‌ను పింక్ లైన్‌లో విలీనం చేయడంతో అది 71 కి.మీలకు విస్తరించి పూర్తిస్థాయి రింగ్ మెట్రోగా మారింది. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ లైన్‌తో పాటు మరో మూడు కొత్త కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణలు ఢిల్లీ, నోయిడా, ఎయిర్‌పోర్టుకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి.

దేశంలో తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సుమారు 12.3 కిలోమీటర్ల మజ్లిస్ పార్క్ బాబర్‌‌‌‌పూర్ కారిడార్‌‌‌‌ను ఇప్పటికే పనిచేస్తున్న మజ్లిస్ పార్క్–శివ్ విహార్ పింక్ లైన్‌‌‌‌లో కలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది ప్రారంభం కావడంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71 కిలోమీటర్లకు పెరిగి దేశంలోనే తొలి పూర్తిస్థాయి ‘రింగ్ మెట్రో’గా మారింది. ఈ మార్గంలో యమునా నదిపై మెట్రో లైన్, వాహనాల కోసం ఫ్లైఓవర్‌‌‌‌ కలిపి ఎత్తైన బ్రిడ్జి నిర్మించారు. ఇక దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్ వరకు 9.9 కిలోమీటర్లలో మరో కొత్త లైన్​ నిర్మించారు. ఈ మార్గంలోని కొన్ని చోట్ల లైన్​ సుమారు 28 మీటర్ల ఎత్తులో ఉంది. ఫేజ్–5(ఏ) విస్తరణలో భాగంగా మూడు కొత్త మెట్రో కారిడార్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 9 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్‌ను ‘సెంట్రల్ విస్టా కారిడార్’ పేరుతో చేపడుతున్నారు. 2 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్‌తో గోల్డెన్ లైన్ విస్తరణ ఏరోసిటీ-టెర్మినల్ 1, 3.9 కి.మీ. ఎలివేటెడ్ లైన్‌ను ‘తుగ్లకాబాద్-– కాలింది కుంజ్’ విస్తరణలో భాగంగా చేపడుతున్నారు. ఈ కొత్త మార్గాల ద్వారా నోయిడా నుంచి సౌత్​ ఢిల్లీ, ఎయిర్‌పోర్టుకు ప్రయాణం మరింత ఈజీగా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు

క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం

Follow Us