AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు

బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు

Phani CH
|

Updated on: Mar 11, 2026 | 12:50 PM

Share

ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులకు ప్రముఖ వ్యాపారవేత్త యోగేష్ దోషి ఉచిత ఆశ్రయం, భోజనం కల్పించారు. విమానాలు రద్దు కావడంతో స్వదేశానికి తిరిగి రాలేక, హోటళ్ల గడువు ముగిసి ఇబ్బంది పడుతున్న 125 మందికిపైగా భారతీయులకు తన అపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. ధీరజ్ జైన్ వంటి ఇతర భారత సంతతి వ్యక్తులు కూడా సహాయం అందిస్తున్నారు.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా ఘర్షణలతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు వసతి బోజనం ఏర్పాట్లు చేసేందుకు వ్యాపారవేత్త యోగేశ్‌ దోషి ముందుకువచ్చారు. 64 అపార్ట్‌మెంట్‌లో వసతి కల్పించారు. విమానాలు క్యాన్సిల్‌ కావడంతో యూఏఈ నుంచి ఇండియాకు రావాల్సిన భారతీయులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయాలని అల్‌ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలుకాని సమయంలో తమకు ఈ సహాయం అందిందని భారతీయులు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హోటల్‌ బస ముగియడంతో మేం ఖాళీ చేయాల్సివచ్చింది. స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం లేదు. అలాంటి గందరగోళ పరిస్థితిలో ఈ అపార్ట్‌మెంట్ గురించి తెలిసింది. ఆ ఏర్పాటు మాకెంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్‌ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక షెల్టర్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం ఇతర కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా యోగేశ్‌ దోషి చూసుకుంటున్నారు. యోగేశ్‌తో పాటు ఇతర భారత సంతతి వ్యక్తులు తమ స్నేహహస్తం అందిస్తున్నారు. అజ్మన్‌ ప్రాంతంలో వ్యాపారవేత్త ధీరజ్‌జైన్ ఇలాంటి వసతులే ఏర్పాటుచేశారు. వెంటనే స్వదేశానికి వెళ్లలేనివారి కోసం తన ఫామ్‌హౌస్‌లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ సౌకర్యం అందిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ షెల్టర్ కు తీసుకురావడానికి రోల్స్ రాయిస్‌ సహా 11 కార్లను నడుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!

భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా

హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు

దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం

ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

Follow Us