AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుఇంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్!
Telangana Phone Tapping Case
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 3:23 PM

Share

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టమైన షరతులను విధించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు కీలక సమాచారం అందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని, కొద్ది వారాల్లోనే ఈ కేసులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన విచారణ కొనసాగుతోందని ధర్మాసనానికి వివరించారు.

కేసు నేపథ్యం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు రావడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టై జైల్లో ఉండగా, విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుకు తాజాగా లభించిన ఈ బెయిల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us