బెంగళూరులో చిలుక జోస్యం పేరుతో ఓ కేటుగాడు ఆదాయపన్ను శాఖ అధికారిని లక్షల రూపాయలు, బంగారం, వెండి మోసం చేశాడు. అదృష్టం పదింతలు చేస్తానని నమ్మించి, ప్రత్యేక పూజల పేరుతో శేఖర్ అనే వ్యక్తి సత్యనారాయణన్ నుండి మొదట రూ. 50,000, ఆపై 194 గ్రాముల బంగారం, 1.3 కిలోల వెండి దోచుకున్నాడు. మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు కొనసాగుతోంది.