Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది
జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ప్రారంభించారు. కర్ణాటకకు రావడం అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టుంటుందని, కిమ్స్ హాస్పిటల్ తన కుటుంబ సభ్యుల లాంటిదని తెలిపారు. తన తాత ఎన్టీఆర్ 1983లో శంకుస్థాపన చేసిన చోటే తాను ప్రారంభించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భాస్కర్, గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకకు రావడం తనకెప్పుడూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. 1983 మే 20న తన తాత ఎన్టీఆర్ ఇదే ప్రదేశంలో శంకుస్థాపన చేశారని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తాను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కిమ్స్ ఫ్యామిలీతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, 2009లో జరిగిన ప్రమాదంలో భాస్కర్, కిమ్స్ హాస్పిటల్, గురువారెడ్డి తన ప్రాణాలను కాపాడారని, ఆజన్మాంతం వారికి రుణపడి ఉంటానని చెప్పారు. భాస్కర్ గారి విజన్‌ను అద్వైక్, అభి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. పేషెంట్ ఈజ్ పారమౌంట్ అనే లక్ష్యంతో కిమ్స్ దేశానికే అతిపెద్ద ఆసుపత్రిగా నిలవాలని ఆకాంక్షించారు. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, సురక్షితంగా ఇళ్లకు వెళ్ళమని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల
ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్.. అమెరికాపై దాడులకు కుట్ర ??
బెంజ్ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు
కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!
భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

