AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది తర్వాత వీరికి ఉద్యోగ యోగం ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా?

Ugadi 2026 Job Astrology: ఉగాది ప్రాంతంలో ఉద్యోగాలకు సంబంధించిన మూడు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందు వల్ల కొన్ని రాశుల వారు మే లోగా ఉద్యోగపరంగా స్థిరత్వం సంపాదించే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం పొందడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి కూడా అవకాశం ఉంది. త్వరలో వీరికి తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 6:14 PM

Share
వృషభం: ఈ రాశికి ఒకటి రెండు నెలల పాటు దశమ, లాభ స్థానాలు పటిష్టంగా ఉన్నందువల్ల మే చివరి లోగా ఈ రాశివారు తప్పకుండా ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగానికి కారకుడైన శనితో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన రవి కూడా లాభ స్థానంలో ఉన్నందువల్ల వీరికి ఏ రంగానికి చెందిన ఉద్యోగమైనా కొద్ది ప్రయత్నంతో లభించే అవకాశం ఉంది. ఈ రాశి నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాలకు కూడా ప్రయత్నాలు సాగించడం మంచిది. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు.

1 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, రవి, శనులు యుతి చెందడం వల్ల సమీప భవిష్యత్తులో అనేక విధాలైన ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారు ప్రైవేట్ రంగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశముంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది.

2 / 6
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో జూన్ మొదటి వారం వరకు గురువు సంచారం సాగిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మే లోపు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశివారికి ప్రైవేట్ ఉద్యోగం లభించడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో వీరి శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా విదేశీ లేదా దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆశించిన జీతభత్యాలు లభిస్తాయి.

3 / 6
తుల: ఈ రాశికి షష్ట స్థానంలో శని, రవి, శుక్రులు, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఉగాది నుంచి వీరికి ఉద్యోగపరంగా దశ తిరిగే అవకాశం ఉంది. ఈ రాశి నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం నుంచే కాక, ప్రభుత్వ రంగం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందడం, డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, బుధులు, చతుర్థ స్థానంలో శని, రవి, శుక్రులు యుతి చెందడం, రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో వీరి తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించి ప్రభుత్వ ఉన్నతోద్యోగాలు సంపాదించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది.

5 / 6
కుంభం: ఈ రాశిలో కుజ, బుధులు కలవడం, ద్వితీయ స్థానంలో శని, శుక్ర, రవులు యుతి చెందడం, ఈ రాశి మీద గురు వీక్షణ ఉండడం వల్ల కొద్ది ప్రయత్నంతో వీరికి స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. తక్కువ కాలంలో భారీ జీతభత్యాలతో ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.

6 / 6
Follow Us
ఉగాది తర్వాత వీరికి ఉద్యోగ యోగం ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా?
ఉగాది తర్వాత వీరికి ఉద్యోగ యోగం ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా?
'విరోష్' మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ కు సూపర్బ్ రెస్పాన్స్..

వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది
వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా?

ఉగాది వచ్చేస్తోంది.. శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?

వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు వెనుక ఇంత ఉందా? ఎంత డేంజరో తెలిస్తే

రిస్క్ తీసుకుంటే సక్సస్ పక్కా.. వీరికి ఊహించని అదృష్టం..!

మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినబోయిన విద్యార్ధి.. పొట్టు తీయగా

మార్చి 31లోపు డబ్బులు కట్టకపోతే పెనాల్టీ..

ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన