Telangana: కేసీఆర్, కేటీఆర్, కవితకు ఆ పదవులు ఖాయం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని తెలిపారు. దీంతో పాటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావులకు ఎలాంటి పదవులు వరిస్తాయోకూడా చెప్పేశారు.

Telangana: కేసీఆర్, కేటీఆర్, కవితకు ఆ పదవులు ఖాయం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Follow us

|

Updated on: Aug 16, 2024 | 3:51 PM

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని తెలిపారు. దీంతో పాటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావులకు ఎలాంటి పదవులు వరిస్తాయోకూడా చెప్పేశారు. దీంతో ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ అవుతారని, అలాగే కేటీఆర్‎కు కేంద్రమంత్రి పదవి వరిస్తుందని చెప్పారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‎గా ఉంటారన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్‎కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అయ్యాక ఆ నలుగురి మద్దతు కూడా బీజేపీకి వస్తుందన్నారు. ఆ తరువాత కవితకు బెయిల్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ అనంతరం.. బీఆర్ఎస్ నాలుగు రాజ్యసభ సీట్లకుగానూ కవితకు కూడా రాజ్యసభ సభ్యురాలిగా పదవి కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వడం తధ్యం అని జోస్యం చెప్పారు. దీనిపై బీర్ఎస్ నేతలు ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విధి విధానాలను గురించా వివరించారు. ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ రానున్నారని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చెప్పారు. అలాగే రైతు రుణమాఫీ‎కి 5 వేల కోట్ల నిధులు రిజర్వ్‎లో ఉంచామన్నారు. ఇప్పటికీ రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే జిల్లా కలెక్టరేట్‎కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఒకే కుటుంబంలో వారికి రూ. 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‎గా పరిగణించి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీని ప్రకటించానన్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదన్నారు.

ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్..

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఊహాజనితమని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. విలీనం అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అల్లికి అల్లి సున్నకి సున్న అన్నట్లు చేసిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రూ.31 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని కేవలం రూ.18 వేల కోట్లతో మమ అనిపించారన్నారు. అర్హత ఉన్నవారికి రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ కానివారు బిజెపి రచ్చబండ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారని చెప్పారు. సుమారు లక్షా 30వేల మంది రైతులు ఫిర్యాదు చేశారన్నారు.

హైడ్రాతో ప్రభుత్వం చేస్తున్న హైడ్రామాను ముందు ఆపాలన్నారు. FTL లో ఉన్న భూములు ప్రభుత్వ భూములు కాదని, అందులో పట్టా కలిగిన వారు కూడా ఉన్నారన్నారు. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను కూల్చవద్దని, వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం బిజెపిలో స్తబ్దత లేదని, ఏ పార్టీ లో అయిన ఎత్తుపల్లాలు ఉంటాయని వివరించారు. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కూడా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నామన్నారు. ఏ ఎన్నికలైనా బిజెపి సమానంగా పోరాడుతుందన్నారు. ఇక ఎప్పటి నుంచో ఉత్కంఠ కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ఎంపికపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కేసీఆర్, కేటీఆర్, కవితకు ఆ పదవులు ఖాయం.. సీఎం రేవంత్ కీలక కామెంట్
కేసీఆర్, కేటీఆర్, కవితకు ఆ పదవులు ఖాయం.. సీఎం రేవంత్ కీలక కామెంట్
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు శుభవార్త..ఆ నియమాలు పాటించాల్సిందే.!
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు శుభవార్త..ఆ నియమాలు పాటించాల్సిందే.!
చెన్నై రిటైన్షన్ లిస్టులో ఆరుగురు.. జాబితాలో షాకింగ్ పేర్లు..
చెన్నై రిటైన్షన్ లిస్టులో ఆరుగురు.. జాబితాలో షాకింగ్ పేర్లు..
7 గుర్రాల పెయింటింగ్ మీ ఇంట్లో ఉందా..?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
7 గుర్రాల పెయింటింగ్ మీ ఇంట్లో ఉందా..?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
అమెరికాలో స్థిరపడదామనుకునే వారికి షాక్..!
అమెరికాలో స్థిరపడదామనుకునే వారికి షాక్..!
ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2 రోజులు ఫుల్‌గా వర్షాలే వర్షాలు
ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2 రోజులు ఫుల్‌గా వర్షాలే వర్షాలు
దర్జాగాకుర్చీలోకూర్చుని పోలీస్‌స్టేషన్ తనిఖీ చేస్తున్న వానరం
దర్జాగాకుర్చీలోకూర్చుని పోలీస్‌స్టేషన్ తనిఖీ చేస్తున్న వానరం
లంగావోణిలో దివ్యభారతి.. రెండు కళ్లు చాలవు..
లంగావోణిలో దివ్యభారతి.. రెండు కళ్లు చాలవు..
అనుపమ పరమేశ్వరన్ రూట్ ఎటు.? హిట్స్ ఉన్న ఛాన్సులు లేవా.?
అనుపమ పరమేశ్వరన్ రూట్ ఎటు.? హిట్స్ ఉన్న ఛాన్సులు లేవా.?
వరిపొట్టు, కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ.. అనుమానంతో చెక్ చేయగా..
వరిపొట్టు, కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ.. అనుమానంతో చెక్ చేయగా..
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!