Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మాల్స్‌లో మహిళా రక్షణకు హైదరాబాద్ పోలీసుల కీలక చొరవ.. ఇక సీక్రెట్ కెమరాలకు చెక్

78వ స్వాతంత్ర్యదినం సందర్భంగా మహిళలు, చిన్నారులకు నగరాన్ని సురక్షితంగా మార్చేందుకు.. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత సురక్షితంగా ఉండేలా షాపింగ్ మాల్స్‌లో సీక్రెట్ కెమెరాలు లేదా స్పై కెమెరాలను తనిఖీ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర పోలీసులు, విద్యాశాఖ, జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో నగరంలోని షాపింగ్​ కాంప్లెక్స్​లు, మాల్స్​లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న లాంఛనంగా ప్రారంభించారు.

Hyderabad: మాల్స్‌లో మహిళా రక్షణకు హైదరాబాద్ పోలీసుల కీలక చొరవ.. ఇక సీక్రెట్ కెమరాలకు చెక్
Latest Technolgy
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2024 | 1:53 PM

ఆధునిక విజ్ఞానం మనిషిని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తుందో.. అదే సమయమలో పాతాళానికి కూడా తోసేస్తుంది. ముఖ్యంగా సీక్రెట్ కెమెరాలు, పెన్నుల్లో కెమెరాలు వంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో వచ్చిన తర్వాత కొంతమంది మేధస్సు అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యంగా మాల్స్ లోని డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ , వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. ఈ నేపధ్యంలో భాగ్యనగర పోలీసులు ఇటువంటి సంఘటనపై ద్రుష్టి పెట్టారు. 78వ స్వాతంత్ర్యదినం సందర్భంగా మహిళలు, చిన్నారులకు నగరాన్ని సురక్షితంగా మార్చేందుకు.. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత సురక్షితంగా ఉండేలా షాపింగ్ మాల్స్‌లో సీక్రెట్ కెమెరాలు లేదా స్పై కెమెరాలను తనిఖీ చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర పోలీసులు, విద్యాశాఖ, జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో నగరంలోని షాపింగ్​ కాంప్లెక్స్​లు, మాల్స్​లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న లాంఛనంగా ప్రారంభించారు.

ఈ తనిఖీ బృందాల్లో మహిళా ప్రొఫెషనల్ నిపుణులు కూడా ఉన్నారు. వీరు మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, వాష్‌రూమ్‌లు, టాయిలెట్లలో ఏమైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల్లో ఎటువంటి కెమెరా కనిపించక పొతే ఆ స్థలం సురక్షితంగా, భద్రంగా ఉందని ప్రకటిస్తారు. ఈ తనిఖీలు పెద్ద, చిన్న షాపింగ్ మాల్స్ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ నిర్వహిస్తారు. ఇందుకోసామ్ మాల్స్ ను క్షుణ్ణంగా వెతకడంతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరికరాలను కూడా వినియోగించనున్నామని పోలీసు అధికారులు చెప్పారు. షాప్ సురక్షితం ఏ కెమెరా లేదు అని అనుకుంటే ఆ ప్రాంతాన్ని వ్యక్తిగత సురక్షిత ప్రాంతంగా ప్రకటించడమే కాదు ఒక స్టిక్కర్ కూడా అతికిస్తారు.

ఈ ప్రయత్నం మహిళలు, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని దుకాణాలు, మాల్స్‌లో బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. కార్యక్రమంలో పాల్గొనే ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు గంటకోసారి మేరకు హవర్​బ్యాంక్​ అకౌంట్​ క్రెడిట్లు కూడా ఇస్తారు. పౌరులందరికీ ముఖ్యంగా మహిళలకు సురక్షితమై, సాధికారతతో కూడిన వాతావరణాన్ని సృష్టించేందుకు తాము ఎల్లప్పుడు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. స్వేచ్ఛ, సమానత్వ స్ఫూర్తిని పునరుద్ఘాటిస్తూ గురువారం ఈ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు. పౌరుల గోప్యతను కాపాడేందుకు చట్టపరమైన చర్యల గురించి తెలిపారు నగర్ కమిషనర్

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..