Hyderabad: గచ్చిబౌలిలో వాహన తనిఖీలు.. అనుమానితులను పోలీసులు చెక్ చేయగా..
గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపినా సరే..! మహానగరంపై మత్తు మరక చెరిగిపోవడంలేదు. వారం రోజులుగా ఎక్కడో ఓ చోట పట్టుబడుతూనే ఉంది. తాజాగా మారోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టించింది. ఈసారి దొరికింది రాజస్థాన్‌కు చెందిన బడా గ్యాంగ్.
గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపినా సరే..! మహానగరంపై మత్తు మరక చెరిగిపోవడంలేదు. వారం రోజులుగా ఎక్కడో ఓ చోట పట్టుబడుతూనే ఉంది. తాజాగా మారోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టించింది. ఈసారి దొరికింది రాజస్థాన్‌కు చెందిన బడా గ్యాంగ్.
మత్తును చిత్తు చేద్దాం.. డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్ధాం. ఈ స్లోగన్‌తో ఓవైపు తెలంగాణ సర్కార్ యుద్ధం చేస్తుంటే, మరోవైపు మత్తు ముఠాలు హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఎంతలా నిఘా పెట్టినా.. ఎన్ని వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎన్ని కేసులు పెడుతున్నా.. చివరాఖరకు చిప్ప కూడు పెడుతున్నా సరే.. కొందరి ప్రవర్తన మారడం లేదు. హైదరాబాద్‌లో వారం రోజులుగా నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ సైబర్ సిటి పరిధిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.
గచ్చిబౌలిలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లు పట్టుబడ్డారని పోలీసలుు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పేర్కొన్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ. 4.34 కోట్లు ఉంటుందని వివరించారు. ఈమేరకు ఎస్‌వోటీ పోలీసులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్‌వోటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టులతోపాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు నిర్వహస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం(ఆగస్ట్ 16) తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్ స్మగ్లర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ మహానగరానికి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసలు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. విషయం తెలిసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అక్కడకు చేరుకుని.. డ్రగ్ ఫెడ్లర్‌లకు విక్రయిస్తుండగా ఎనిమిది మందిని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. చెక్ పోస్ట్‌ల దగ్గర తనిఖీలు చేస్తుంటే, రోజూ గంజాయి వాసన కంపు కొడుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..