AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడ స్కాన్ చేయగా షాకింగ్ నిజం

కడుపులో బిడ్డ పెరుగుతోందని నమ్మి 9 నెలలు ఆనందంగా గడిపిన ఓ మహిళకు షాకింగ్ నిజం తెలిసింది. గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులోని గడ్డను బిడ్డగా భావించి నెలల పాటు చికిత్స అందించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకోగా.. కడుపులో బిడ్డ కాదు గడ్డ పెరుగుతోందని తేలడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడ స్కాన్ చేయగా షాకింగ్ నిజం
Gudivada Hospital
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2026 | 1:35 PM

Share

ఆ మహిళ తనకు బిడ్డ పుడుతుందని అని ఎంత మురిసిపోయిందో.. కడుపులోని బిడ్డను కళ్లతో చూశాక.. తన దిష్టి కూడా తగలకుండా జాగ్రత్తలు చేయాలని ఎంత ఆరాపడిందో.. కానీ సరిగ్గా 9 నెలలు నిండిన తర్వాత కడుపులో ఉంది బిడ్డ కాదు గడ్డ అని తెలిసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక నైరాశ్యంలోకి వెళ్లింది. గుడివాడలో వెలుగుచూసింది ఈ ఘటన. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కడుపులోని గడ్డను.. బిడ్డగా చెబుతూ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు 9 నెలల పాటు వైద్యం చేశారు. నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు తెలిపింది సదరు మహిళ. దీంతో కనీస సమాచారం ఇవ్వకపోగా.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేశారు అక్కడి సిబ్బంది. కడుపుతీపితో 9 నెలలు అక్కడి వైద్యులు చెప్పిన టీకాలు అంగన్వాడీ సెంటర్‌లోనూ వేయించుకుంది ఆ మహిళ. ఆఖరికి అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.. బిడ్డ లేదు పెరిగింది గడ్డ అని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. స్కానింగ్ రిపోర్టు తీసుకెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా.. వాళ్లు నీళ్లు నములుతూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందినరోజే ఆ రాజ్యం గొప్పగా ముందుకు సాగుతున్నట్లు. ఇలాంటి కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తీరు వల్ల.. ప్రభుత్వ వ్యవస్థలపైనే నమ్మకం లేకుండా పోతుంది.

Also Read: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. సాకారం కాబోతున్న చిరకాల వాంఛ 

Follow Us
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో