AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి..

AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!
Andhra Pradesh Weather
Srilakshmi C
|

Updated on: Aug 10, 2026 | 8:20 AM

Share

అమరావతి, ఆగస్ట్‌ 10: ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

మరోవైపు శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారు. బుడార్సింగి పంచాయతీ పరిధిలోని పడంగో గ్రామంలో ఆదివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కార్మికుల సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో పడంగో గ్రామానికి చెందిన కె. సోముద్రి (44), పాతకోటకు చెందిన సవర జోర (45) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు మహిళలు మజ్జి దేవకి, బుయా పోరోమి, కుమారో నీలా, కట్టువ సుస్మిత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గిరిజన నేతలు కోరుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Follow Us
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..