వేసవిలో రోజూ కొబ్బరినీళ్లు తాగితే.. మీ కిడ్నీల పరిస్థితి ఇదే!
12 March 2026
TV9 Telugu
TV9 Telugu
వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. చెమట ద్వారా శరీరం ఎక్కువగా నీటిని కోల్పోవడంతో నీరసంగా అనిపిస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా బయట ఎక్కువగా పనిచేసే వారు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే చక్కెరలు అధికంగా ఉండే శీతల పానీయాల కంటే కొబ్బరి నీటిని తీసుకోవడం మంచి ఎంపిక
TV9 Telugu
కొబ్బరినీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి సహజంగా అందుతాయి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి
TV9 Telugu
పైగా కొబ్బరి నీరు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తుంది. కొబ్బరి నీటిని తాగడం వల్ల పొటాషియం, సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి
TV9 Telugu
శరీరంలో ద్రవసమతుల్యం పునరుద్దరించడంతో పాటు కండరాల నొప్పులు తగ్గుతాయి. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలసట, చర్మంపై రాషెస్, తలనొప్పి వంటి ఎండ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
వేసవిలో జీర్ణక్రియ సమస్యల నుంచి బయటపడటానికి కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే బయోఆక్టివ్ ఎంజైమ్స్, సహజ ఆల్కలైన్ గుణాలు జీర్ణాశయానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి
TV9 Telugu
దీంతో ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వేసవికాలంలో కొబ్బరి నీటిని తాగడం వల్ల ఇందులోని సహజ చక్కెరలు, మెగ్నీషియం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి
TV9 Telugu
ఈ నీళ్లు మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి నీటిలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరం మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి