ఖాళీ కడుపుతో జీడిపప్పు తింటున్నారా?

11  march 2026

Jyothi Gadda

జీడిపప్పులు పోషకాల గని. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి అనేక రకాలుగా లాభాలు చేకూరుతాయి.

జీడిపప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి త్వరిత శక్తిని అందిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఈ శక్తి మరింత త్వరగా అందుతుంది.

దీనిలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి , చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. 

జీడిప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి ఎముకలను బలపరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీడిపప్పులో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

జీడిపప్పులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి.

ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 20-30 గ్రాముల జీడిపప్పులు తినవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ మొత్తం మారవచ్చు. అయితే జీడిపప్పుకు అలర్జీ ఉన్నవారు జీడిపప్పును తీసుకోకూడదు.

ఖాళీ కడుపుతో జీడిపప్పు తినడం వల్ల కడుపులో మంట లేదా అజీర్తి వచ్చే అవకాశం ఉంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరగడానికి దారితీస్తుంది.