AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Fellowship 2026: ఏపీ, తెలంగాణ యువతకు ఎస్బీఐ ఫెలోషిప్‌ ఆహ్వానం.. నెలకు రూ.21 వేలతోపాటు రూ.1,10,000 గ్రాంట్ కూడా!

తెలుగు రాష్ట్రాల్లోని యువతకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2027’ కోసం ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఫెలోషిప్ భారత్‌తోపాటు నేపాల్, భూటాన్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) నుండి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ వ్యక్తులు కూడా..

SBI Fellowship 2026: ఏపీ, తెలంగాణ యువతకు ఎస్బీఐ ఫెలోషిప్‌ ఆహ్వానం.. నెలకు రూ.21 వేలతోపాటు రూ.1,10,000 గ్రాంట్ కూడా!
SBI Youth For India Fellowship
Srilakshmi C
|

Updated on: Mar 12, 2026 | 9:14 AM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2027’ కోసం ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఫెలోషిప్ భారత్‌తోపాటు నేపాల్, భూటాన్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) నుండి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మొత్తం 13 నెలల పాటు ఫెలోషిప్‌ ఉంటుంది. ఫెలోలు 13 నెలలు గ్రామాల్లో నివసిస్తూ, పనిచేస్తూ, విద్య, జీవనోపాధి, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత వంటి పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్‌లో పాల్గొనేవారు గ్రామీణ జీవితాన్ని లోతుగా తెలుసుకునేందుక అవకాశం ఉంటుంది. అలాగే ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ప్రసిద్ధ ప్రభుత్వేతర సంస్థలతో (NGO’s)తో కలిసి పని చేస్తారు.

అర్హతలు ఏమేం ఉండాలంటే..

అక్టోబర్‌ 4, 2024వ తేదీ నాటికి బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. భారతీ పౌరుడై ఉండాలి. అలాగే నేపాల్‌, భారతదేశ విదేశీ పౌరుడు (OCI), NRIలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి 1994 ఆగస్టు 4 కంటే ముందు, 2005 అక్టోబర్ 5 కంటే తరువాత జన్మించి ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 30, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు ప్రక్రియ 2 దశల్లో ఉంటుంది. తొలుత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పర్సనల్‌ ఇంటరాక్షన్‌ రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో దరఖాస్తుదారుల ప్రేరణలు, అనుభవాలు, ఫెలోషిప్ లక్ష్యం, గ్రామీణాభివృద్ధికి దోహదపడే సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన సభ్యులకు నెలవారీ స్టైపెండ్‌ రూ.21 వేలు, రవాణా, ప్రాజెక్ట్ ఖర్చు స్టైపెండ్‌లు, భాషా మార్గదర్శకత్వం, ఏడాది పొడవునా గైడెన్స్‌ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఫెలోషిప్ పూర్తైన తర్వాత రూ.1,10,000 గ్రాంట్ అందజేస్తారు. ఇతర వివరాలకు ఆధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us