AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు

మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు

Phani CH
|

Updated on: Mar 11, 2026 | 2:11 PM

Share

గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అరుదైన 'రీప్లాంటేషన్' శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రమాదంలో తెగిపడిన యువకుడి చేతిని ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ ద్వారా తిరిగి అతికించి, అంగవైకల్యం కలగకుండా కాపాడారు. ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాల సమన్వయంతో, ఆరు గంటల్లోపు రక్తప్రసరణ పునరుద్ధరించి, ఎనిమిది గంటల శస్త్రచికిత్సతో ఈ అద్భుతం సాధించారు. వైద్యుల సకాల స్పందన, నైపుణ్యం వల్ల యువకుడు కోలుకున్నాడు.

రోజురోజుకి వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ప్రాణం పోయడమే కాదు, పోయిన అవయవానికి పునర్జన్మ నివ్వగలమని గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు నిరూపించారు. అత్యంత క్లిష్టమైన, అరుదైన ‘రీప్లాంటేషన్’ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, ఒక యువకుడికి అంగవైకల్యం కలగకుండా కాపాడారు. జార్ఖండ్‌కు చెందిన ఒక యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదవశాత్తూ అతని చెయ్యి తారు యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. స్థానికులు అప్రమత్తమై, తెగిపడిన చేతిని భద్రపరిచి బాధితుడిని వెంటనే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలు సమన్వయంతో రంగంలోకి దిగాయి. ముందుగా రోగిని పరిక్షించిన వైద్యులు ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ ఆపరేషన్ ద్వారా చేతిని తిరిగి అతికించవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఈ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయడానికి అనేక విభాగాల వైద్యులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. తెగిపడిన అవయవానికి 6 గంటల్లోపు రక్తప్రసరణ పునరుద్ధరించడం అత్యంత కీలకం. డాక్టర్ శాంతకుమార్ శివలింగప్ప, డాక్టర్ లిఖిత రెడ్డి, డాక్టర్ మనోజ్ నేతృత్వంలోని బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అనంతరం మైక్రో సర్జరీ ద్వారా రక్త నాళాలను అనుసంధానించారు. ఆర్థోపెడిక్ వైద్యులు ఎముకను అమర్చగా, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని సరిచేశారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లే ఈ అరుదైన ‘ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్’ సర్జరీ సాధ్యమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతా సింగ్ వెల్లడించారు. ఈ అసాధారణ విజయం సాధించిన వైద్య బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..

ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?

LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ

గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత

ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..

Follow Us