Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం చేసేందుకు పూజా నియమాలు .. ఈ రోజున ఏమి చేయాలి ? ఏమి చేయకూదంటే . .

తెలుగు రాష్ట్రాలలోని లోగిళ్ళు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసేవారు కొన్ని పనులను చేయాలి.. అదే సమయంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయవద్దు. ఈ ర్రోజు వరలక్ష్మీ వ్రతం సదర్భంగా ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు తెలుసుకుందాం..

Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం చేసేందుకు పూజా నియమాలు .. ఈ రోజున ఏమి చేయాలి ?  ఏమి చేయకూదంటే . .
Varalakshmi Vratam
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2024 | 11:50 AM

శ్రావణ మాసం అంటే మహిళల పూజల మాసం.. శ్రావణ మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. ఇక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్షి దేవి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ రోజున (ఆగష్టు 16వ తేదీన) వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలలోని లోగిళ్ళు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసేవారు కొన్ని పనులను చేయాలి.. అదే సమయంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయవద్దు. ఈ ర్రోజు వరలక్ష్మీ వ్రతం సదర్భంగా ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు తెలుసుకుందాం..

శ్రావణ మాసం రెండో శుక్రవారం లక్ష్మీదేవి రూపాల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని పుజిస్తారు. అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ రోజు ఏదైనా అనుకోని విధంగా పూజ చేయడం వీలుకాకపొతే శ్రావణ మాసంలోని ఎ శుక్రవారం అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం అంటే లక్ష్మీదేవిని భక్తీ శ్రద్దలతో నియమ నిష్టలతో పూజ చేయడం. శ్రావణమాసంలో మగువలు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ రోజున వరలక్ష్మిదేవిని పూజించి వ్రతం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని.. వివాహిత స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు ఈ వ్రతం చేసుకోవడం వలన సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయి.

అయితే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసేవారు కొన్ని పనులు చేయాలి.. మరికొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.. వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజున వేకువ జామునే నిద్ర లేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని మామిడి తోరణాలతో.. ఇంటి ముంగిలిని ముగ్గులతో అలంకరించాలి. ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం.. కనుక ఈశాన్య దిశలో ముగ్గులు వేసి లక్ష్మీదేవి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. బియ్యం పిండితో వేసిన ముగ్గు మీద పసుపు కుంకుమ పెట్టిన పీటాన్ని ప్రతిష్టించాలి. అనంతరం దీనిపై తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి అనంతరం కలశ ప్రతిష్ట చేయాలి. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఏనుగు ప్రతిమలు లేక పొతే ఏనుగు ప్రతి రూపంగా పసుపు కొమ్ములను అమ్మవారికి అభిముఖంగా పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

కలశంపై కొబ్బరికాయనుమ, జాకెట్ ను ఏర్పాటు చేయాలి. తోరణాలు సిద్దం చేసుకుని వాటికీ పూజించాలి. పూజ సమయంలో ఆవు నేతితో దీపం వెలిగించి ఆవు పాలతో చేసిన పరమాన్నంతో పాటు శక్తి మేరకు ఇతర ఆహార పదార్ధాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

లక్ష్మీదేవికి ప్రీతికరమైన అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకం లతో పాటు కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదవం వలన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. పూజ ముగిసిన అనంతరం ముత్తైదువుకు వాయినం అందించి ఆతిథ్యం ఇవ్వడం శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ వ్రతం రోజున ఉపవాస నియమం లేదు.. అంతేకాదు జాగరణ కూడా చేయాలి అన్న నియమం కూడా లేదు. అయితే వ్రతం ముగిసే వరకూ ఎటువంటి ఆహారపదార్ధాలను తీసుకోరాదు. ఇలా నియమాలతో వరలక్ష్మి వ్రతం చేయడం శుభ్రప్రదం అని పండితులు చెబుతున్నారు.

చేసే వారు ఎలా ఉండాలంటే..

వరలక్ష్మీ వ్రతం చేసే వారు చాలా ప్రశాంత చిత్తంతో ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి.. వరలక్ష్మి అంటే వరాలిచ్చే తల్లి.. కనుక మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే ఆమె ఆశీస్సులు లభించి భర్త దీర్ఘాయుస్సుతో ఉంటారని.. శ్రావణ శుక్రవారం వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని చూసినా.. వ్రత కథ విన్నా చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని మహిళల నమ్మకం. అందుకంటే వరలక్ష్మి వ్రతం రోజున తమ శక్తి కొలదీ అమ్మవారిని అలంకరిస్తారు. నవకాయ పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. పూజ అనంతరం ఆకలి అన్నవారికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజు చేసిన దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం అని అంటున్నారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసేవారు చిత్త శుద్ధితో , ఏకాగ్రతతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు.. ఇతరులను తిట్టవద్దు.. అదే సమయంలో మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా ప్రశాంత చిత్తంతో పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు