Solar Eclipse 2024: ఈ ఏడాదిలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? మనదేశంలో కనిపిస్తుందా.. సూతకాలం ఎప్పుడంటే..?

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2024లో ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రెండవ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ గా ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే భూమి నుంచి సూర్యుడు దూరంగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది.

Solar Eclipse 2024: ఈ ఏడాదిలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? మనదేశంలో కనిపిస్తుందా.. సూతకాలం ఎప్పుడంటే..?
Solar Eclipse 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2024 | 10:10 AM

హిందూ మతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ ఏడాది 2024లో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవించింది. దీని ప్రభావం అమెరికా, దాని సమీప దేశాలలో కనిపించింది. భారతదేశంలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం రెండవ, చివరి సూర్యగ్రహణం గురించి ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? ఈసారి భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా? వంటి అనేక విషయాలను తెలుసుకుందాం..

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2024లో ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రెండవ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ గా ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే భూమి నుంచి సూర్యుడు దూరంగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయనప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. దీని వలన సూర్యుని బయటి భాగం ప్రకాశవంతమైన వృత్తాకార వలయంగా కనిపిస్తుంది. ఒకవేళ దీనిని భారతదేశంలో చూడలేకపోతే ప్రజలు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

2024లో సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 2 అక్టోబర్ 2024న సంభవిస్తుంది. ఈ రోజు హిందూ క్యాలెండర్‌లోఅమావాస్య తిది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:13 గంటలకు ప్రారంభమై ఆగస్టు 3న తెల్లవారుజామున 3:17 గంటలకు ముగుస్తుంది. ఈ కంకణాకార సూర్యగ్రహణం మొత్తం సుమారు 6 గంటల 4 నిమిషాల పాటు కొనసాగుతుంది.

రెండో సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా?

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఇలా జరగడానికి ప్రధాన కారణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడటమే.

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే

ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోతే..అది ప్రపంచంలోని బ్రెజిల్, కుక్ దీవులు, చిలీ, పెరూ, అర్జెంటీనా, మెక్సికో, హోనోలులు, ఫిజీ, ఉరుగ్వే, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆర్కిటిక్, బ్యూనస్ ఎయిర్స్ , బెకా ద్వీపం వంటి దేశాల్లో ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

సూర్యగ్రహణం సూతక కాలం

సాధారణంగా సూతకాలాన్ని సూర్యగ్రహణం సంభవించే కాలం అంటారు. పురాణ గ్రంథాల ప్రకారం సూర్యగ్రహణానికి కేవలం 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఈసారి సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.. అందువల్ల దీని సూత కాలం కూడా చెల్లదు. సూతకం సమయంలో శుభ కార్యాలు జరగవు. అదే సమయంలో ఈ గ్రహణ సమయంలో పూజలు చేయడం నిషేధం. సూతకాల సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసి వేసి గ్రహణం ముగిసిన తర్వాత గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాతే తలుపులు తెరుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు