డీఐవై రాఖీలు: ఎంత ఖరీదైన రాఖీ కొన్నప్పటికి చేత్తో తయారుచేసి రాఖీ కట్టిన రాఖి ప్రత్యేకంగా అనిపిస్తుంది. దానికోసం ఇంట్లోనే దొరికే బియ్యం గింజలు, వడ్ల గింజలు, గుమ్మడి విత్తనాలు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వులతో అందంగా అతికిస్తే రాఖీ రెడీ అవుతుంది. ఒక అట్టముక్క గుండ్రంగా కత్తిరించి దానిమీద మంచి డిజైన్లో అతికిస్తే చాలు. పక్కలకు డోరీలు అతికిస్తే రాఖీ రెడీ.