- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Beautiful Photos in Red Colour Saree, Pics Goes Viral
Janhvi Kapoor: అందాల జాబిలమ్మలా జాన్వీ కపూర్.. అతిలోక సుందరి తనయ అద్భుతమైన ఫోటోస్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు దక్షిణాదిలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ జోడి చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు.
Updated on: Aug 15, 2024 | 10:15 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు దక్షిణాదిలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ జోడి చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవల విడుదలైన చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ లో సెన్సెషన్ అయ్యింది.

దేవర సినిమాతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలోనూ ఈ బ్యూటీ నటించనుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా అటు తమిళంలోనూ సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఎర్ర చీరలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సంప్రదాయ లుక్కులో మరింత అందంగా కనిపిస్తుంది.

తాజాగా జాన్వీ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. చీరకట్టులో అచ్చం తన తల్లి శ్రీదేవిని గుర్తుచేస్తుందని.. జాన్వీ అందాల జాబిలమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




