Movie Updates: టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి.. ఎవరు ఎక్కడున్నారంటే.?

మహేష్ బాబు ఇంకా రాజమౌళి కోసం మేకోవర్ అవుతూనే ఉన్నారు.. మరోవైపు పవన్ ఇంకొన్నాళ్లు రాజకీయాల్లోనే బిజీగా ఉండబోతున్నారు.. రవితేజ, రామ్ లాంటి హీరోలేమో తాజాగానే వచ్చారు. అయినా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు గానీ.. మొత్తం షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..

Prudvi Battula

|

Updated on: Aug 16, 2024 | 8:36 AM

 పారిస్‌ నుంచి వచ్చాక విశ్వంభర సెట్‌లో జాయిన్ అయిపోయారు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది  జనవరి 10న సంక్రాంతి కానుకగా రానుంది.

1 / 5
ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ హర్రర్ కామెడీ చిత్రం  రాజా సాబ్ షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుంది. ఇటివల ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇది వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

2 / 5
అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కొన్ని వారాలుగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే నడుస్తుంది. డిసెంబర్ 6నే ఈ చిత్రం వస్తుందంటున్నారు మేకర్స్. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కోటి ఉమెన్స్ కాలేజ్ సమీపంలో జరుగుతుంది.

3 / 5
 జూనియర్ ఎన్టీఆర్ దేవర కీలక షెడ్యూల్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.  వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా షూట్ కేరళ లోని పొల్లాచ్చిలో జరుగుతుంది. నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూట్ అరకుకు షిఫ్ట్ అయింది.

4 / 5
 మిస్టర్ బచ్చన్ తర్వాత భాను బొగ్గవరపు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. జైపూర్ షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ పయనమయ్యారు NBK 109 టీం. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు బాబీ. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.

5 / 5
Follow us