Iran-Israel Tensions: యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్, నెతన్యాహు ఏమన్నారంటే..
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగిస్తాం..అంటూ పేర్కొంది. ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై మిస్సైల్ దాడులు చేసింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది.. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ .. ఇరాన్ లోని 30 ప్రాంతాల్లో మిసైల్ దాడులు నిర్వహించింది.. దీంతో ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ అటాక్ చేయగా.. సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగిస్తాం..అంటూ పేర్కొంది. ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై మిస్సైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై 30 మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై తమ బలగాలు కూడా దాడులు చేశాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి.. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ను అణుశక్తిగా మారనివ్వం.. అమెరికన్లను రక్షించడమే మా కర్తవ్యం.. అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వెంటనే లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేశారు.
ఇరాన్‌లో జరుగుతున్న సైనిక చర్యలో కొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ భవిష్యత్తు భద్రత కోసం ఈ చర్య తీసుకుంటున్నామని తెలిపారు. ఇరాన్‌లో అమెరికా సైనిక చర్య విస్తృతమైనది.. కొనసాగుతోంది. అమెరికా, దాని ప్రజలను ప్రమాదం నుండి రక్షించడమే ఈ చర్య ఉద్దేశ్యం అని ట్రంప్ నొక్కి చెపన్పారు.
ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచన..
“మీ ఇళ్లలో సురక్షితంగా ఉండండి. మీ ఇళ్లను వదిలి బయటకు రాకండి. బయట చాలా ప్రమాదం ఉంది. బాంబులు ప్రతిచోటా పడతాయి. మేము పూర్తి చేసినప్పుడు, మీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి. ఇది మీదే అవుతుంది. ఇది మీకు, బహుశా, తరతరాలుగా ఉన్న ఏకైక అవకాశం. సంవత్సరాలుగా, మీరు అమెరికాను సహాయం అడిగారు, కానీ మీకు అది ఎప్పుడూ లభించలేదు. ఈ రాత్రి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని చేయడానికి ఏ అధ్యక్షుడు సిద్ధంగా లేరు. ఇప్పుడు మీకు కావలసినది ఇచ్చే అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి మీరు ఎలా స్పందిస్తారో చూద్దాం. అమెరికా మీకు అపారమైన శక్తి.. ప్రమాదకరమైన శక్తితో మద్దతు ఇస్తోంది.”
నెతన్యాహు కీలక ప్రకటన..
ఉగ్రవాద పాలన ముప్పును తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని.. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. “ఇరాన్‌లో ఉగ్రవాద పాలన వల్ల ఎదురయ్యే అస్తిత్వ ముప్పును తొలగించే ఆపరేషన్ ను ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
