AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటే ఏమవుతుందో తెలుసా..? లైట్ తీసుకుంటే ప్రాణాలకే రిస్క్..

ఆరోగ్యానికి అమృతం లాంటి పుచ్చకాయను తీసుకునే సమయం సరిగ్గా లేకపోతే అది కాస్తా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడమే కాకుండా.. ప్రాణాల మీదకు తెచ్చే ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. అసలు పరగడుపున పుచ్చకాయ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటే ఏమవుతుందో తెలుసా..? లైట్ తీసుకుంటే ప్రాణాలకే రిస్క్..
Watermelon Side Effects On Empty Stomach
Krishna S
|

Updated on: May 26, 2026 | 7:16 AM

Share

వేసవిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ . దాదాపు 92 శాతం నీటిని కలిగి ఉండి, ఎర్రగా, తీయగా ఉండే ఈ పండు ఎండల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించే పుచ్చకాయను తినే విషయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి తీవ్ర నష్టాలు తలెత్తుతాయో వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

పోషకాల గని.. కానీ సమయం తప్పితే ప్రమాదం

100 గ్రాముల తాజా పుచ్చకాయలో సుమారు 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనితో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, కంటి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. అయినప్పటికీ దీనిని తీసుకునే సమయం, పద్ధతి సరిగ్గా లేకపోతే ప్రయోజనం కంటే హానీ ఎక్కువగా జరుగుతుంది.

ఖాళీ కడుపుతో తింటే వచ్చే 3 ప్రధాన ఆరోగ్య సమస్యలు..

బ్లడ్ షుగర్ లెవల్స్‌లో ఆకస్మిక మార్పు

పుచ్చకాయలో సహజ చక్కెరలు, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా బోర్డర్ లైన్ డయాబెటిస్ ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది.

ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినడం

పుచ్చకాయను ఖాళీ కడుపుతో అధికంగా తీసుకోవడం వల్ల అది నాచురల్ డ్యూరెటిక్‌గా పనిచేసి తరచుగా మూత్ర విసర్జన జరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత తలకిందులై, తీవ్రమైన నీరసం, కండరాల బలహీనత, తలతిరగడం వంటి సమస్యలు రావచ్చు.

జీర్ణ సమస్యలు – కడుపు ఉబ్బరం

ఇందులో ఉండే విపరీతమైన నీటి శాతం, ఫైబర్ కారణంగా.. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు కడుపు భారంగా అనిపించడం, గ్యాస్ పట్టేయడం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు ఉదయాన్నే పుచ్చకాయ తింటే, అది జీర్ణవ్యవస్థతో త్వరగా ప్రతిస్పందించి సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

అపోలో నిపుణులు ఏమంటున్నారు?

అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ నిపుణులు డాక్టర్ రోహిత్ శర్మ అభిప్రాయం ప్రకారం.. “పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, మెటబాలిజం స్లోగా ఉన్నవారు ఉదయాన్నే దీనిని తింటే తీవ్రమైన విరేచనాల బారిన పడే ప్రమాదం ఉంది.” అని హెచ్చరిస్తున్నారు.

అసలు పుచ్చకాయ తినడానికి సరైన పద్ధతి ఏంటి?

చిరుతిండి తర్వాతే బెస్ట్: పుచ్చకాయను ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా లైట్ బ్రేక్‌ఫాస్ట్ తిన్న గంట లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం అత్యంత ఉత్తమం.

మధ్యాహ్న కాలం శ్రేష్ఠం: దీనిని మధ్యాహ్నం 11 గంటల సమయంలో గానీ లేదా సాయంత్రం వేళ మిడ్ డే స్నాక్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ పక్కాగా అందుతుంది.

పరిమితి ముఖ్యం: మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను పూర్తిగా దూరం పెట్టక్కర్లేదు కానీ, వైద్యుల సలహాతో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

Follow Us
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం