వాడు మనిషి కాదు మానవ మృగం.. వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలన విషయాలు..

కోల్‎కత్తాకు చెందిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత హత్యగా గుర్తించినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వాడు మనిషి కాదు మానవ మృగం.. వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలన విషయాలు..
Kolkata
Follow us
Srikar T

|

Updated on: Aug 13, 2024 | 6:56 PM

కోల్‎కత్తాకు చెందిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత హత్యగా గుర్తించినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‎కత్తా ఆర్‎జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‎గా విధుల నిర్వర్తిస్తున్న మహిళను అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అసిస్టెంట్ సూపరింటెండెంట్. బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. అయితే ముందుగా ఆత్మహత్య అని చెప్పి తరువాత హత్యగా కేసు నమోదు చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి.

వైద్యుల నిరసన, ప్రముఖుల మద్దతు..

ఈ నేపథ్యంలోనే బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏడు మంది డాక్టర్లును పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఏడు మందిలో నలుగురు డాక్టర్లు బాధితురాలితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా పలువురు మహిళా సంఘాలు, డాక్టర్లు, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిరసనలు చేపట్టారు. నో సేఫ్టీ, నో డ్యూటీ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఆగస్ట్ 14న అర్థరాత్రి 11.55 గంటలకు స్వాతంత్య్రం వచ్చినా అమ్మాయిలకు స్వాతంత్య్రం రాలేదంటూ ధర్నా చేసేందుకు పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటూ స్వస్తికా ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమ్‌ డి గుప్తా మద్దతు తెలిపారు.

పోస్టుమార్టం రిపోర్టు ఇలా..

ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచారానికి గురైన వ్యైద్యురాలి కళ్లు, కాళ్లు, నోరుతో పాటూ శరీరంలోని ఇతర ప్రైవేట్ భాగాలలో రక్తశ్రావం జరిగినట్లు గుర్తించారు. కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లతోపాటూ ఇతర అవయవాలపై కూడా గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఈ పైశాచికత్వానికి పాల్పడిన నిందితుడు ఘటనపై పశ్చాతాపం తెలుపకుండా తనను ఉరితీయాలంటే తీసుకోండి అంటూ నిర్లక్ష్యంగా బదలు సమాధానం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి ఫోన్ తీసుకున్న పోలీసులు పరిశీలించగా ఫోన్లో చాలా వరకూ అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు వెల్లడించారు.

నిందితుడి వివరాలు ఇలా..

కోల్‎కత్తా ఆర్‌.జి.కార్‌ మెడికల్ కాలేజ్‎లో వైద్యురాలిగా పని చేస్తున్న 31 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడింది సంజయ్ రాయ్‎గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టుకు హాజరుపరిచారు. నిందితుడికి ఆగస్ట్ 23 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించింది. విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ను అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్య చేసి అత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కు 4 పెళ్లిళ్లు అయినట్లు తెలుస్తోంది. భర్త వేధింపులు తాళలేక విసిగి బేజారెత్తి ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నట్లు సమాచారం. మరో భార్య గత సంవత్సరం క్యాన్సర్ బారినపడి చనిపోయినట్లు పేర్కొన్నారు అతని సంబంధీకులు. మద్యం అలవాటు ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..