AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ వేడుకలో కాల్పుల కలకలం.. రెప్పపాటు తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి!

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు జరిగాయి. హఠాత్తు పరిణామంతో అప్రమతమైన ఫరూక్ అబ్ధుల్లా తృటిలో తప్పించుకున్నారు. బుధవారం (మార్చి 11) జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన న్యాయవాది వివాహానికి అబ్దుల్లా హాజరయ్యారు.

వివాహ వేడుకలో కాల్పుల కలకలం.. రెప్పపాటు తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి!
Man Points Gun At Former Cm Farooq Abdullah
Balaraju Goud
|

Updated on: Mar 12, 2026 | 7:41 AM

Share

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు జరిగాయి. హఠాత్తు పరిణామంతో అప్రమతమైన ఫరూక్ అబ్ధుల్లా తృటిలో తప్పించుకున్నారు. బుధవారం (మార్చి 11) జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన న్యాయవాది వివాహానికి అబ్దుల్లా హాజరయ్యారు. కమల్ సింగ్ జామ్వాల్‌గా గుర్తించిన కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. “దేవుడు దయ వల్ల మా తండ్రి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదు, కానీ లోడ్ చేసిన పిస్టల్‌తో ఒక వ్యక్తి అతని దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడని మాకు తెలుసు. భద్రతా బృందం బుల్లెట్‌ను అడ్డగించి, హత్యాయత్నాన్ని భగ్నం చేసింది. ప్రస్తుతం, సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, వాటిలో ఒకటి Z+ (NSG) భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒకరు ఎలా దగ్గరగా వెళ్ళగలిగారు అనేది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది” అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

ఫరూక్ అబ్దుల్లాపై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు కమల్ సింగ్ జామ్వాల్ జమ్మూ నివాసి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వీడియోలో, నిందితుడు ఫరూక్ అబ్దుల్లా వద్దకు వెళ్లి కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది. అతను కాల్పులు జరపగానే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ కేబినెట్ మంత్రి సతీష్ శర్మ స్పందిస్తూ.., ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా ఒక ప్రముఖ భారతీయ నాయకుడు, అతనికి సరైన భద్రత కల్పించాలని ఆయన అన్నారు. ఇది భద్రతా లోపం, కానీ అతను పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఫరూఖ్ అబ్దుల్లా భద్రతా దళాల పరిధిలో ఉన్నారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి కూడా ఉన్నారు. చౌదరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అతనికి వైద్య సహాయం అందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us