Viral: కదులుతున్న రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందంటే.!
కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైలులోంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ లోని బిల్‌పుర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హావ్‌డా- అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలు బిల్ పూర్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో..
కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైలులోంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ లోని బిల్‌పుర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హావ్‌డా- అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలు బిల్ పూర్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో.. కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని తీసి స్ప్రే చేశారు. దాంతో పొగలు రావడంతో.. రైలులో మంటలు చెలరేగి ఉంటాయనే ఆందోళన మొదలైంది. కొందరు ప్రయాణికులు భయంతో అత్యవసర బ్రేక్ చైన్ లాగారు. కానీ రైలు ఆగేలోపే భయంతో కొందరు ప్రయాణికులు కిందికి దూకేశారు. ఈ క్రమంలో 12 మందికి గాయాలైనట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిజానికి అప్పటికే రైలు వేగం బాగా తగ్గిందని.. లేకుంటే క్షతగాత్రుల సంఖ్య పెరిగి ఉండేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

