Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్‌... అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. కానీ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది ఇండియాలో కాదు.. చైనాలో.

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

|

Updated on: Apr 15, 2024 | 7:51 AM

ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్‌… అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. కానీ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది ఇండియాలో కాదు.. చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ సూపర్‌ మార్కెట్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్ తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటుంది. ఈ లీవ్‌ను మేనేజ్‌మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదట. ఉద్యోగి మనసు బాలేదని ఆఫీసుకు సెలవు పెడితే ఇచ్చి తీరాల్సిందేనట. ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలిక పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. నా విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పని చేయమని బలవంతం చేయడం అనైతికం.

రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేయాలి, వారాంతాల్లో సెలవులు ఉండాలి, 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని నేను అనుకోను. మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటూ యు డాంగ్లాయ్‌ తెలిపారు. కాగా పాంగ్ డాంగ్ లై సూపర్‌మార్కెట్‌లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు. అంటే 80,878 రూపాయలు. అన్‌హ్యాపీ లీవ్‌’ కింద ఏడాదిలో 10 రోజుల లీవ్‌ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇవి అదనం. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో యు డాంగ్లాయ్ ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘ఇంత మంచి బాస్ ఉంటారా?, ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలి’ అని రాసుకొచ్చారు. నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాంగ్ లాయ్‌ మార్కెట్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆనందాన్ని, గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను” అంటూ మరొకరు స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us