Coconut Water: సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు ఏ టైమ్ లో తాగాలి..? నిపుణుల సూచనలు..!
సమ్మర్‌లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మామిడిపళ్లు, తాటి ముంజలు, సీమచింతకాయలు ఇలా ఎన్నో పళ్లు దొరుకుతాయి. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొబ్బరి బోండాలు ఎప్పుడూ దొరుకుతాయి. కానీ సమ్మర్‌లో ఈ కొబ్బరినీళ్లు ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఈ కొబ్బరి నీళ్లు ఎంతగానో తోడ్పడతాయి.
సమ్మర్‌లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మామిడిపళ్లు, తాటి ముంజలు, సీమచింతకాయలు ఇలా ఎన్నో పళ్లు దొరుకుతాయి. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొబ్బరి బోండాలు ఎప్పుడూ దొరుకుతాయి. కానీ సమ్మర్‌లో ఈ కొబ్బరినీళ్లు ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఈ కొబ్బరి నీళ్లు ఎంతగానో తోడ్పడతాయి. ఒక కొబ్బరి బొండాం నీళ్లు తాగితే రోజంతా హుషారునిస్తుంది. అదే సమయంలో బాడీని కూల్ చేస్తుంది కూడా. కొబ్బరి నీళ్లలో కాల్షియం, మాంగనీస్ లాంటివి ఉంటాయి. సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే చాలామంది సమయ పాలన లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. కొబ్బరినీళ్లు తాగడంలో సమయపాలన చాలా ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. దానివల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చంటున్నారు.
కొబ్బరినీళ్లు ఏ సమయంలో తాగాలి అనే ప్రశ్న చాలమందిలో ఉంది. కొంతమంది ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మరికొందరు మధ్యాహ్నం తాగడం మంచిదని భావిస్తుంటారు. ఈ విషయమై జైపూర్‌కు చెందిన డైటీషియన్ కొన్ని సూచనలు చేశారు. కొబ్బరి నీళ్లు భోజనంతో కానీ, భోజనం తర్వాత కానీ అస్సలు తాగకూడదంటున్నారు. గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఖాళీ కడుపుతో ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. బరువును తగ్గిస్తుంది .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.