EPFO: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పరిమితి పెరిగితే ఏమవుతుందో తెలుసా..?

EPFO: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పరిమితి పెరిగితే ఏమవుతుందో తెలుసా..?

Subhash Goud

|

Updated on: Apr 14, 2024 | 8:55 PM

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 15,000 రూపాయలుగా ఉన్న ఈ సీలింగ్‌ను 21,000 రూపాయలుకు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈపీఎఫ్‌వోలో సభ్యత్వం ఉన్న ఉద్యోగులు ఎప్పట్నుంచో వేతన పరిమితిని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో చివరిసారిగా పీఎఫ్‌ సాలరీ లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 15,000 రూపాయలుగా ఉన్న ఈ సీలింగ్‌ను 21,000 రూపాయలుకు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈపీఎఫ్‌వోలో సభ్యత్వం ఉన్న ఉద్యోగులు ఎప్పట్నుంచో వేతన పరిమితిని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో చివరిసారిగా పీఎఫ్‌ సాలరీ లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 6,500 రూపాయల నుంచి 15,000 రూపాయలు కు మార్చింది. ఇక 1952లో Epfo పథకం మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా మొత్తం 8సార్లు పెంచారు. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెరిగితే కంపెనీల యాజమాన్యాలపై భారం పడినా.. ఉద్యోగులకు మాత్రం లాభమే జరుగుతుంది. ఉద్యోగి బేసిక్‌ సాలరీ, డీఏ ఆధారంగా ప్రావిడెంట్‌ ఫండ్‌కు నగదు మొత్తాలు నెలనెలా జమవుతాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, దీనికి సమానంగా యాజమాన్యం ద్వారా మరో 12 శాతం పీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. దీనికి సంబంధించిన వేతన పరిమితే ప్రస్తుతం 15,000 రూపాయలు గా ఉంది. ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెరిగితే ఏమవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..