Terminator Photos: రాత్రికి, పగలుకు మధ్య మనకు కనిపించని సంధ్యా సమయం ఇదే.!

వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లి చీకటి కమ్మితే రాత్రి.. ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం. దానినే మనం సన్‌సెట్‌ అంటూ వ్యవహరిస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఈ సన్‌సెట్‌ పాయింట్‌ను మనం చూస్తాం. కానీ మనకు కనిపించని సంధ్యా సమయం ఒకటుంటుంది. అది మనకు స్పష్టంగా కనిపించదు. కానీ ఆకాశం నుంచి చూస్తే.. వెలుగు, చీకట్ల మధ్య ఒక విభజన రేఖ కనిపిస్తుంది. భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే ఉంటుంది.

Terminator Photos: రాత్రికి, పగలుకు మధ్య మనకు కనిపించని సంధ్యా సమయం ఇదే.!

|

Updated on: Aug 13, 2024 | 6:55 PM

వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లి చీకటి కమ్మితే రాత్రి.. ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం. దానినే మనం సన్‌సెట్‌ అంటూ వ్యవహరిస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఈ సన్‌సెట్‌ పాయింట్‌ను మనం చూస్తాం. కానీ మనకు కనిపించని సంధ్యా సమయం ఒకటుంటుంది. అది మనకు స్పష్టంగా కనిపించదు. కానీ ఆకాశం నుంచి చూస్తే.. వెలుగు, చీకట్ల మధ్య ఒక విభజన రేఖ కనిపిస్తుంది. భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇలా రాత్రిని, పగలును విభజించే రేఖను సాంకేతికంగా ‘టెర్మినేటర్’ అని పిలుస్తారు. భూమ్మీద దాదాపు అన్ని ప్రాంతాల్లో రోజూ రెండు సార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది. టెర్మినేటర్ రేఖ వాటిపై నుంచి కదులుతూ వెళుతుంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెర్మినేటర్ రేఖను నాసా చిత్రించింది. తాజాగా తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో అన్నింటికన్నా పైన నల్లని అంతరిక్షం.. దాని దిగువన నీలి రంగులో భూమి వాతావరణం.. దాని కింద భూమిపై పడి తెలుపు రంగులో ప్రతిఫలిస్తున్న కాంతి.. ఆ దిగువన బంగారు రంగులోని సంధ్యా సమయ కాంతి.. అన్నింటికన్నా కింద ఇంకా రాత్రి చీకట్ల వల్ల నలుపు రంగులో కనిపిస్తున్న భూమి ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us