Watch Video: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ముఖ్య సమస్యలు..

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అకస్మిక తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

Watch Video: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ముఖ్య సమస్యలు..
Mudhole Mla Rama Rao
Follow us
Srikar T

|

Updated on: Aug 13, 2024 | 2:42 PM

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అకస్మిక తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అక్కడ వసతి, భోజనం ఇతర సమస్యలను గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు.

విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో కావలసిన సౌకర్యాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. వర్షానికి నీరు హాలులో వస్తున్న కారణంగా నిద్రపోయేందుకు తగిన సౌకర్యం ఉండటం లేదని వివరించారు. అలాగే శారీరక వ్యాయామాల కోసం తగిన క్రీడా మైదానం కావాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. విద్యార్థులనుంచి ఫిర్యాదులను స్వయంగా రాసుకుని వాటిపై తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..