అవకాశాలు గల్లంతు.. సినిమాల స్పీడ్ తగ్గించిన రీతూ వర్మ
Rajeev
07 march 2026
తెలుగమ్మాయి రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు అందానికి ఫిదా అవ్వని కుర్రాళ్లు ఉండరు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ భామ.
ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది.
ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది రీతూ వర్మ.
ఆతర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని, స్వాగ్, మజాకా అలాగే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ చేసింది.