AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన జాన్వీకపూర్.. శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కాదంటున్న స్టార్ హీరోయిన్

ఆమె తెరపై కనిపిస్తే ఒక మెరుపు.. నడిస్తే ఒక రాజసం. డ్యాన్స్ సీక్వెన్స్‌లలో ఆమె శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. చాలామంది హీరోయిన్లు గంటల తరబడి బరువులు ఎత్తుతూ జిమ్‌లో చెమటోడుస్తుంటే, ఈ బ్యూటీ మాత్రం చాలా ప్రశాంతంగా, నియంత్రిత పద్ధతిలో చేసే 'పైలేట్స్' వర్కవుట్‌ను ఎంచుకుంది.

ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన జాన్వీకపూర్.. శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కాదంటున్న స్టార్ హీరోయిన్
Jahnvi Kapoor
Nikhil
|

Updated on: Mar 08, 2026 | 8:26 AM

Share

అసలు ఈ పైలేట్స్ వల్ల ఆమెకు కలిగిన ప్రయోజనాలేంటి? బాడీ బిల్డింగ్ కంటే ఇది ఎలా భిన్నమైనది? బాలీవుడ్ తార జాన్వీ కపూర్ తన నటనతోనే కాదు, తన ఫిట్‌నెస్‌తోనూ కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె జిమ్ బయట కనిపించే ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, మిగతా హీరోయిన్లలాగా ఆమె కేవలం కఠినమైన జిమ్ వర్కవుట్లపైనే ఆధారపడదు. ఆమె ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా? అదే ‘పైలేట్స్’. శరీరాన్ని విల్లులా వంచడమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచే ఈ వ్యాయామంపై జాన్వీకి ఎందుకు అంత మక్కువో తెలుసుకుందాం..

కఠినమైన వర్కవుట్ల కంటే..

జాన్వీ కపూర్ పైలేట్స్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం—ఇది శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండానే బలాన్ని ఇస్తుంది. కఠినమైన వెయిట్ లిఫ్టింగ్ వల్ల కండరాలు పట్టేయడం లేదా గాయాలయ్యే ముప్పు ఉంటుంది. కానీ పైలేట్స్‌లో ప్రతి కదలిక నియంత్రిత పద్ధతిలో ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు మరియు గాయాల నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది.

చాలామంది మహిళలు జిమ్ అంటే కండలు వచ్చేస్తాయని భయపడుతుంటారు. కానీ పైలేట్స్ వల్ల శరీరం బల్కీగా (లావుగా) మారదు. ఇది లోతైన కోర్ కండరాలను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల శరీరం దృఢంగా, చెక్కిన శిల్పంలా మారుతుంది తప్ప, స్టిఫ్ గా అనిపించదు. జాన్వీ నడకలో కనిపించే ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం ఆమె కోర్ స్ట్రెంత్. పైలేట్స్ వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది, తద్వారా బాడీ పోశ్చర్ మెరుగుపడుతుంది. షూటింగ్ సమయంలో గంటల తరబడి డ్యాన్స్ చేయాలన్నా, నిలబడాలన్నా ఆమెకు ఈ వ్యాయామమే బలాన్నిస్తుంది. ఇది కండరాల బిగుతును తగ్గించి, శరీరం సాఫీగా కదలడానికి సహకరిస్తుంది.

మానసిక ప్రశాంతత..

పైలేట్స్ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఒక మానసిక సాధన. శ్వాసపై నియంత్రణ, నెమ్మదైన కదలికలు ఒత్తిడిని తగ్గిస్తాయి. బిజీ షెడ్యూల్‌లో ఉండే జాన్వీకి, ఈ వర్కవుట్ మనసును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. ఇది అలసటను ఇవ్వదు సగదా, సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫిట్‌నెస్ అంటే ఏదో కష్టమైన పనిలా కాకుండా, ఒక జీవనశైలిలా మార్చుకోవాలని జాన్వీ కపూర్ నిరూపించింది. పైలేట్స్ ద్వారా బలం, ఫ్లెక్సిబిలిటీ మరియు బ్యాలెన్స్ ఎలా సాధించవచ్చో ఆమె ఒక ఉదాహరణ.

Follow Us
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
అంత గుడ్డిగా ఎలా నమ్మావ్‌ బ్రో.. ఎస్‌ఐ నంటూ ఫోన్‌ కట్‌చేస్తే..
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
పూజల్లో ఎక్కువగా వాడే ఈ రంగుల వెనుక అసలు అర్థం తెలుసా?
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
అప్పట్లోనే చిరంజీవి నటించిన ఇంగ్లీష్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందంటే
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
ఆ హీరోయిన్‌ వల్లనే నేను స్టార్ డైరెక్టర్ అయ్యా:ధురంధర్ డైరెక్టర్
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..
చలికాలంలో ఈ లడ్డూలు పిల్లలకు తినిపిస్తే ఉక్కులా తయారవుతారు..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం..
వామ్మో.. షుగర్ వ్యాధి దీనివల్ల కూడా వస్తుందా?..
వామ్మో.. షుగర్ వ్యాధి దీనివల్ల కూడా వస్తుందా?..
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు..
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు..
తిరుమలలో శ్రీవారి దర్శనమే కాదు.. తప్పక చూడాల్సిన పవిత్ర ప్రదేశాలు
తిరుమలలో శ్రీవారి దర్శనమే కాదు.. తప్పక చూడాల్సిన పవిత్ర ప్రదేశాలు
మహిళకు ఆపరేషన్ తర్వాత షాక్..! 'రూకీ మిస్టేక్‌' అన్న వైద్యుడు
మహిళకు ఆపరేషన్ తర్వాత షాక్..! 'రూకీ మిస్టేక్‌' అన్న వైద్యుడు