‘నా అవయవాలు దానం చేస్తున్న’.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిజ్ఙ..
హైదరాబాద్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 13: హైదరాబాద్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని తెలిపారు. అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బతుకుతాయని సజ్జనార్ తెలిపారు. తాను మరణానంతరం తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారని తెలిపారు.
ఈ మహాయజ్ఙంలో ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాలన్నారు. ఇటీవల ఇలాంటి కార్యక్రమం తాను చూడలేదన్నారు. అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని తనకు విశ్వాసం ఉందని తెలిపారు. మన రాష్ట్రాంలోనే కాకుండా దేశంలో కూడా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలన్నారు. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 అని తెలిపారు. అలాగే కెడావర్ డొనేషన్లు 2,942 ఉన్నాయని తెలిపారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం అని ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు.
క్యూఆర్ కోడ్ విడుదల..
ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌లో ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు కామినేని ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు ‘గర్వించదగిన అవయవ దాత’ కార్డును పంపిస్తారు. అవయవదాతగా పేరు నమోదుచేసుకోవడం ద్వారా, కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయగల అవకాశం మీకు దక్కుతుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..