‘అవకాశం వచ్చినా బీజేపీలోకి వెళ్లలేదు..’ టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. తనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. తనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. నారీ న్యాయ్ గురించి రాహుల్ గాంధీ గొప్పగా చెబుతున్నారని, కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ నారీ న్యాయ్ ఎక్కడా కనిపించడంలేదని ఆమె అన్నారు.
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తూ కష్టపడిన వారికి కాంగ్రెస్‌లో న్యాయం జరగడం లేదని.. అసలైన కార్యకర్తలకు పార్టీలో అసలు విలువ లేదని సునీత బాధపడ్డారు. ఇరత పార్టీల నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి మంచి అవకాశాలు వచ్చినా.. తాను పార్టీ మారలేదని సునీత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కచ్చితంగా ఓడిపోయే గోషామహల్ సీటు ఇచ్చి తనకు అన్యాయం చేశారని.. ఇప్పుడు పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించాలని చూస్తున్నారని సునీతా రావు బాధ పడ్డారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
