AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది.

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?
Tvk Party Chief Vijay Election Promises
Balaraju Goud
|

Updated on: Mar 07, 2026 | 11:39 PM

Share

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది.

ఇప్పుడు తలపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూశారా! అందులో హిట్‌ సీన్స్‌ గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పూబెల్లంలా.. ఉచిత పథకాలను పంచిపెడుతున్న తీరును హీరో విజయ్‌ ఎండగట్టిన విషయం మర్చిపోలమా? అంతా వెళ్లి ఉచిత పథకాలకు సంబంధించి.. ఆ వస్తువులన్నీ మంటల్లో తగలెట్టే అద్భుతమైన దృశ్యాన్ని కాదనగలమా? అది సినిమా కాబట్టి… అది హిట్ కొట్టాలి కాబట్టి…. ఇలాంటి సీన్స్ ఎన్నైనా పెడతారు. వండి వారుస్తారు. జనాలను ఉప్ఫోమని ఉప్పొంగిపోయేలా చేస్తారు. మాకు ఫ్రీ బీలు వద్దు.. ఎన్నికల తాయిలాలు వద్దంటూ.. హీరోలు భారీ డైలాగులే చెబుతారు.

మహిళాలోకంపై ఎన్నికల వరాలు

రీల్‌ బ్లాక్ బస్టర్‌ కావాలంటే.. ఉచితాలు అనుచితం. అదే రియల్‌గా రాజకీయాల్లోకి వచ్చేసరికి.. ఆ ఉచితాలు కాస్తా సముచితం అయిపోతాయన్నమాట. అవును మరి.. సర్కార్‌ సినిమాలో.. ఫ్రీ బీస్‌ వద్దంటూ బల్లగుద్ది మరీ చెప్పిన విజయ్‌.. తాను రాజకీయాల్లోకి వచ్చేసరికి.. పూర్తిగా మారిపోయారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకంపై కురిపించిన ఎన్నికల వరాలు అలియాస్ తాయిలాలు.. ఉరఫ్ హామీలు.. విన్నవారికి, కన్నవారికి అది నిజం అనిపించక మానదు.

తాను రియల్‌ లైఫ్‌లో సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు.. తాను నటించిన సర్కార్‌ సినిమా స్క్రిప్టునే విజయ్‌ పక్కన పెట్టేశారన్నమాట. కేవలం మహిళల కోసమే కాదు.. ఇటీవల తంజావూరులో జరిగిన మీటింగ్‌లోనూ.. రైతుల కోసం అలాంటి ఫ్రీ మేనిఫెస్టోనే ప్రకటించారు విజయ్‌. రెండెకరాలలోపు రైతులకు రుణమాఫీ.. వారి పిల్లలకు ఉచిత విద్య… తమ బాధ్యతన్న విజయ్‌.. ఐదుఎకరాలకు మించి భూములున్న రైతులకు యాభైశాతం రుణమాఫీ చేస్తామన్నారు.

మొత్తానికి రీల్‌ లైఫ్‌ అయితే అలా… రియల్‌ లైఫ్‌ రాజకీయంలో ఇలా.. అన్నట్టుగా సాగుతోంది విజయ్‌ ప్రయాణం. అయితే, ఇప్పటికే రాజకీయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్టయిల్‌లో ముందుకెళ్తున్నారనే చర్చ.. విజయ్ విషయంలో జరుగుతోంది. పవన్‌ పొలిటికల్‌ స్టోరీని రీమేక్‌ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రకటిస్తున్న హామీలు, పథకాలు సైతం.. ఎక్కడో విన్నట్టుందే అనే గుసగుసలకు కారణమవుతున్నాయి. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థికసాయం, ఉచిత బస్సు ప్రయాణం… ఇలా విజయ్‌ ఎత్తుకుంటున్న చాలా పథకాలు తెలుగు రాష్ట్రాలతో పోలి ఉండటం ఆసక్తిరేపుతోంది. విజయ్‌ ప్రకటించిన అన్నపూర్ణ సూపర్‌ సిక్స్‌ని.. ఏపీలో అమలవుతున్న సూపర్‌ సిక్స్‌ పోల్చి చూస్తున్నారు. అయితే, ఇవన్నీ కాపీ కావొచ్చేమో గాని.. అధికారాన్ని ఇచ్చే వాటిలో తమ నాయకుడు ది బెస్ట్ పిక్ చేసుకున్నాడంటూ టీవీకే వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈ ఫీట్లకు ఓట్లు రాలుతాయా? పాట్లు తీరుతాయా? చూడాలి మరి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us