AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG 10th Exams 2026: ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే.. ఇంగ్లిష్‌కి పెరుగుతున్న ఆదరణ

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి పదో తగరతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు..

TG 10th Exams 2026: ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే.. ఇంగ్లిష్‌కి పెరుగుతున్న ఆదరణ
Telangana 10th Class Public Examinations
Srilakshmi C
|

Updated on: Mar 08, 2026 | 7:39 AM

Share

హైదరాబాద్‌, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి పదో తగరతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. గతంలో ఫెయిల్‌ అయిన వారితో కలిపి మొత్తం 5,28,239 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే ఇందులో 4,65,266 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అంటే దాదాపు 89.86 శాతం మంది విద్యార్ధులు ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాయనుండటం విశేషం. ఇక తెలుగు మీడియంలో కేవలం 44,881 మంది మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. ఇది మొత్తం విద్యార్ధుల్లో 8.66 శాతం మాత్రమే.

ఇక మిగిలిన వారు హిందీ, ఉర్దూ, కన్నడ, మళయాలంలో పరీక్షలు రాయనున్నారు. అలాగే రెగ్యులర్‌ విద్యార్థుల్లో 2,50,015 మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరుకానున్నారు. మిగిలిన వారంతా ప్రభుత్వ, గురుకులాలు, ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి రాస్తున్నారు. కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్బీఐ రైల్వే బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల అడ్మిట్‌ కార్డులను తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా 2,273 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలంగాణ సర్కిల్‌లో 80 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 98 పోస్టుల వరకు ఉన్నాయి. ఇక ఆన్‌లైన్‌ రాత పరీక్ష మార్చి 14న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?