మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలపడానికి బెస్ట్ కోట్స్ ఇవే!

Samatha

08 march 2026

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకను మార్చి8న ఘనంగా జరుపుకుంటారు. మహిళల ప్రాధాన్యత, వారికి సమాజంలో సమానమైన గుర్తింపు ఉండాలని ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

స్త్రీ శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.  తల్లిగా, చెల్లిగా, భార్యగా, గురువుగా ఇలా ఏ బాధ్యతలైనా భారం అనుకోకుండా మోస్తూ.. అన్ని విషయాల్లో సహాయ సహకారిగా ఉంటుంది.

స్త్రీ శక్తి

ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ప్రతి రంగంలో మహిళలు కీలక రోల్ పోషిస్తున్నారు. వీటన్నింటి కీ ప్రతీకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అన్ని రంగాల్లో కీ రోల్

అయితే ఈ రోజు మీరు కూడా మీ అమ్మ, లేదా అక్కా, చెల్లె, ఇలా ఎవరైనా సరే, మహిళలకు మంచి కొటేషన్స్ ద్వారా విష్ చేయాలి అనుకుంటున్నారా? అయితే బెస్ట్ కోట్స్ ఇవే!

బెస్ట్ కోట్స్

ఒక మహిళను విద్యావంతురాలిని చేస్తే, ఒక కుటుంబాన్ని విద్యావంతమైనది చేసినట్లే, అందుకే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

విద్యావంతురాలు

అక్షరానికి రూపం నువ్వు, సృష్టికి ప్రాణం నువ్వు, ఓర్పులో భూదేవి నువ్వు, ప్రతి ఒక్కరికీ ఆదర్శం నువ్వు నేటి తరానికి స్ఫూర్తివి నువ్వు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

అక్షర రూపం

కన్నీటి మరకలను చెమట చుక్కలతో తుడుచుకుంటూ, చిరునవ్వుతో ప్రయాణించే మహిళలందరికీ వందనం, మహిళా‌దినోత్సవ శుభాకాంక్షలు.

కన్నీటి మరకలు

మెడలో నగలు కావు, సాధించిన విజయాలే నీకు అలంకారాలు, కన్నీళ్లు కావు, నీలోని చిరునవ్వులే లోకానికి ఆధారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

స్త్రీ విజయాలు