పోలవరం జిల్లా నుంచి రూటు మార్చిన పెద్దపులి కాకినాడ జిల్లాలోకి ప్రవేశించి ప్రత్తిపాడు మండలం దారపల్లి గ్రామ శివారులో కలకలం సృష్టిస్తోంది. పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి కదలికలను గుర్తించి, పట్టుకునే ప్రయత్నాలతో పాటు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.