AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. ఇదికదా అసలైన అవినీతి అంటే.. విజిలెన్స్ సోదాల్లో షాకింగ్ నిజాలు..

విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో మాజీ సివిల్ ఇంజనీర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు సోదాల్లో బయటపడిందా. భువనేశ్వర్ లోని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన తారా ప్రసాద్ మిశ్రను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వారెవ్వా.. ఇదికదా అసలైన అవినీతి అంటే.. విజిలెన్స్ సోదాల్లో షాకింగ్ నిజాలు..
Odisha
Srikar T
|

Updated on: Aug 12, 2024 | 7:04 PM

Share

విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో మాజీ సివిల్ ఇంజనీర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు సోదాల్లో బయటపడిందా. భువనేశ్వర్ లోని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన తారా ప్రసాద్ మిశ్రను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ చీఫ్ ఇంజనీర్‌ ఇంటిపై ఒడిశా విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏకకాలంలో తొమ్మిది చోట్ల దాడులు నిర్వహించగా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో మాజీ ఇంజనీర్ పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ క్రమంలో కొన్ని కీలక డాక్యూమెంట్లు బయటపడ్డాయి.

భువనేశ్వర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా 12 మంది డీఎస్పీలు, 12 మంది సీఐలు, 16 మంది ఏఎస్‌ఐలతోపాటూ ఇతర సహాయక సిబ్బంది ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ సివిల్ ఇంజనీర్ కు సంబంధించి భువనేశ్వర్, కటక్, జార్సుగూడలోని తొమ్మిది ఇళ్లలో దాడులు నిర్వహించారు.

భువనేశ్వర్, నాయపల్లిలోని అర్పాన్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నంబర్ 103లో తారా ప్రసాద్ మిశ్రా నివాసం ఉంటున్నారు. ఇది అతని స్వగృహం కాగా మరిన్ని చోట్లు సొంత ఇళ్లులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇవన్నీకాకుండా లక్షల రూపాలయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు.10 ఇళ్ల స్థలాలు, ఏడు భవనాలు, రూ.2.7 కోట్ల బ్యాంకు డిపాజిట్లతోపాటూ 1.5 కిలోల బంగారం, రూ.6 లక్షల నగదు ఈ తనిఖీల్లో బయడపడింది. అంతేకాకుండా రెండు విలాసవంతమైన కార్లు, అత్యంత ఖరీదైన చేతి గడియారాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇక విదేశీ కరెన్సీతో పాటూ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..