NIRF Rankings: దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌ వర్క్‌ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌.. ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారు. అన్ని విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. టాప్‌ 10లో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్‌ దిల్లీ...

NIRF Rankings: దేశంలో ఉత్తమ విద్యాసంస్థ ఏంటో తెలుసా.? జాబితా ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌
Best Education Institutes
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 12, 2024 | 5:44 PM

దేశంలో అత్యుత్తమ విద్యను అందిస్తున్న విద్యా సంస్థల జాబితాను కేంద్రం విడుదల చేసింది. విద్యా సంస్థలు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా ప్రతీ ఏటా కేంద్ర విద్యాశాఖ ఈ నివేదికను విడుదల చేస్తుంది. 201 నుంచి ఈ ర్యాంకులను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ రూపొందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన జాబితాలో ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా వరుసగా ఆరో ఏడాది ఐఐటీ మద్రాస్‌ ఆరో స్థానంలో నిలిచింది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌ వర్క్‌ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌.. ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారు. అన్ని విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. టాప్‌ 10లో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చోటు దక్కింది.

ఇక యూనవిర్సిటీల పరంగా చూస్తే.. మొదటి స్థానంలో ఐఐఎస్‌సీ బెంగళూరు, రెండో స్థానంలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, మూడో స్థానంలో జామియా మిలియా ఇస్లామియా ఉన్నాయి. కాలేజీల విషయానికొస్తే.. హిందూ కాలేజీ మొదటి స్థానం, మిరాండా కాలేజీ రెండో స్థానంలో, సెయింట్ స్టీఫెన్‌ కాలేజీ మూడో స్థానంలో నిలిచాయి. ఇంజనీరింగ్‌ పరంగా చూస్తే.. ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఐఐటీ ఢిల్లీ, మూడో స్థానంలో ఐఐటీ ముంబయి నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌ విషయానికొస్తే 8వ స్థానంలో ఉంది.

న్యాయ విద్య…

న్యాయవిద్య పరంగా చూస్తే.. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీ మొదటి స్థానంలో ఉండగా దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ రెండో స్థానం. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా మూడో స్థానంలో నిలిచింది.

అర్టిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌..

ఈ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటీ రూర్కీ, రెండో స్థానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇక మూడ స్థానంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చోటు దక్కించుకుంది.

మేనేజ్‌ మెంట్‌ విభాగంలో..

మేనేజ్‌మెంట్ విభాగం విషయానికొస్తే.. ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడో స్థానంలో ఐఐఎం కోళికోడ్‌ చోటు దక్కించుకున్నాయి.

ఫార్మసీ విభాగం..

ఫార్మసీ విభాగం విషయానికొస్తే.. ఢిల్లీలోని జామియా హమ్‌దర్ద్‌ మొదటి స్థానంలో నిలవగా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ రెండో స్థానం, బిట్స్‌ పిలానీ మూడో స్థానం దక్కించుకుంది.

వైద్య విద్యలో..

వైద్య విద్య విషయానికొస్తే.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలవగా.. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్యాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) రెండో స్థానం, వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

డెంటల్‌ పరంగా చూస్తే..

డెంటల్‌ విభాగం విషయానికొస్తే చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ మొదటి స్థానం, మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రెండో స్థానం, దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెన్స్‌ మూడవ స్థానంలో నిలిచాయి.

పరిశోధన విద్యా సంస్థలు..

పరిశోధన విద్యా సంస్థల విషయానికొస్తే.. ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఐఐటీ మద్రాస్‌ రెండో స్థానంలో, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానం సంపాదించుకుంది.

వ్యవసాయ, అనుబంధ విభాగం..

వ్యవసాయ, అనుబంధ విభాగం విషయానికొస్తే.. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (దిల్లీ) మొదటి స్థానంలో నిలవగా, కర్నాల్‌లోని ఐసీఏఆర్‌ రెండో స్థానంలో, లూధియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ మూడో స్థానంలో నిలిచింది.

ఆవిష్కరణ విభాగం..

ఆవిష్కరణ విభాగం విషయానికొస్తే ఐఐటీ బాంబే మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఐఐటీ మద్రాస్‌ రెండో స్థానంలో, ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.

స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీల్లో..

స్టేట్ పబ్లిక్‌ యూనివర్సిటీల విషయానికొస్తే.. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి స్థానంలో, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..