AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులపై దాదాపు 15 శాతం అదనంగా పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కన్వీనర్, బీ, సీ కేటగిరీల్లో పెరిగిన ఫీజులు వర్తిస్తాయని తెలిపింది. అదేవిధంగా పీజీ దంత వైద్య విద్య ప్రవేశ ఫీజు కూడా 15 శాతం పెంచినట్లు తెలిసింది. మరోవైపు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం..

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!
PG Medical Courses
Srilakshmi C
|

Updated on: Aug 12, 2024 | 11:41 AM

Share

అమరావతి, ఆగస్టు 12: పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులపై దాదాపు 15 శాతం అదనంగా పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కన్వీనర్, బీ, సీ కేటగిరీల్లో పెరిగిన ఫీజులు వర్తిస్తాయని తెలిపింది. అదేవిధంగా పీజీ దంత వైద్య విద్య ప్రవేశ ఫీజు కూడా 15 శాతం పెంచినట్లు తెలిసింది. మరోవైపు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆంధ్ర, ఎస్వీయూ పరిధిలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లతోపాటు తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నీట్‌ యూజీ-2024 కటాఫ్‌ మార్కుల కంటే ఎక్కువ వచ్చి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన మెరిట్‌ ఆర్డర్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 89787 80501, 79977 10168 నంబర్లు, సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707 నంబర్‌కు సంప్రదించాలని తెలిపింది.

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా సీట్ల వివరాలు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా 35 వైద్య కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. కన్వీనర్‌ కోటా కింద 3,856 సీట్లు భర్తీ చేయనున్నారు. దంత వైద్య కాలేజీల్లో 1540 బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏడాది ఎస్వీయూ పరిధిలోని శ్రీపద్మావతి మహిళా మెడికల్‌ కాలేజీలోని 175 సీట్లను కూడా ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయమే కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనుంది.

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలనకు కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికోద్యోగులు, సైనికుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 13, 14 తేదీల్లో జరుగుతుందని కాళోజీ యూనివర్సిటీ ఆదివారం (ఆగస్టు 11) ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ సైనికోద్యోగులు, సైనికుల పిల్లల్లో 1 నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకు వచ్చిన వారు ఆగస్టు 13న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావలసి ఉంటుంది. 2.5 లక్షల నుంచి చివరి ర్యాంకు పొందిన వారు ఆగస్టు14న హాజరుకావాలని సూచించింది. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.