AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP KGBV Admissions 2026: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఉచితంగా విద్యా, భోజనం, నివాసం

AP Samagra Shiksha KGBV Admissions 2026: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అర్హులైన బాలికల నుంచి 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 12 2026వ తేదీ నుంచి దరఖాస్తు..

AP KGBV Admissions 2026: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఉచితంగా విద్యా, భోజనం, నివాసం
Andhra Pradesh KGBV Admission Notification
Srilakshmi C
|

Updated on: Mar 06, 2026 | 5:03 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అర్హులైన బాలికల నుంచి 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 12 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలోనూ ప్రవేశాలు కల్పిస్తారు. కాబట్టి అర్హులైన విద్యార్ధులు ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఏపీ కేజీబీవీల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలతో పాటు ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశాలకు దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. అలాగే అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్ధులు కూడా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు టెన్త్ పాసై ఉండాలి. అలాగే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని సంస్థ తెలిపింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, రిజర్వేషన్‌ ఇతర సర్టిఫికెట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35 కేజీబీవీలు పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సీట్లు పొందిన విద్యార్ధులకు ఉచిత చదువుతోపాటు ఉచితంగా ఆవాస, నివాస, భోజన సదుపాయం కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: మార్చి 12, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 1, 2026.
  • విద్యార్థుల సెలక్షన్‌ జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 13, 2026.
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తేదీలు: ఏప్రిల్‌ 13 నుంచి 17 వరకు.

ఏపీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us