AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Californium: రూ. 850 కోట్ల ఖరీదైన 50 గ్రాముల రాయి స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్!

గుట్టుచప్పుడు కాకుండా అత్యంత విలువైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను బీహార్‌ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియంను ముగ్గురు స్మగ్లర్లు గోపాల్‌గంజ్ పోలీసులు..

Californium: రూ. 850 కోట్ల ఖరీదైన 50 గ్రాముల రాయి స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్!
Californium
Srilakshmi C
|

Updated on: Aug 11, 2024 | 12:19 PM

Share

పట్నా, ఆగస్టు 11: గుట్టుచప్పుడు కాకుండా అత్యంత విలువైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను బీహార్‌ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియంను ముగ్గురు స్మగ్లర్లు గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు గోపాల్‌గంజ్‌ ఎస్పీ స్వర్ణ్‌ ప్రభాత్‌ శుక్రవారం తెలిపారు. ఒక్కో గ్రాము విలువ రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘ అత్యం విలువైన వస్తువు అక్రమ రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ యూనిట్ (DIU), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్-7 (SOG-7), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో సహా వివిధ ప్రత్యేక విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆధ్వర్యంలో స్పెషల్ టీం బీహార్-ఉత్తరప్రదేశ్-బల్తారీ సరిహద్దులో మోహరించాయి. ఇదే మార్గంలో గురువారం సాయంత్రం మోటార్‌బైక్‌ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోర్నియం దొరికింది. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్‌లు, 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నాం. స్మగ్లర్లు చాలా నెలలుగా విలువైన వస్తువును విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది’ అని ప్రభాత్ తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా తమ్‌కుహి రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సౌని బుజుర్గ్ గ్రామానికి చెందిన ఛోటే లాల్ ప్రసాద్ (40), గోపాల్‌గంజ్‌లోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్య చౌక్, వార్డు నంబర్ 22లో నివాసం ఉంటున్న చందన్ గుప్తా (40), గోపాల్‌గంజ్‌లోని కుషహర్ మథియా నివాసి చందన్ రామ్‌గా పోలీసులు గుర్తించారు.

నిజానికి కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది సహజసిద్ధంగా లభించే పదార్ధం కాదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్‌ రియాక్టర్లలో దీనిని తయారు చేస్తారు. దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి. అందులో ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో ఉంది. 1950లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతోపాటు చమురు, నీటి పొరలను గుర్తించేందుకు వినియోగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!