AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube: వామ్మో.. యూట్యూబ్‌ చూసి బాంబు తయారుచేసిన పిల్లలు! కానీ అంతలోనే..

తిలోకి స్మార్ట్‌ ఫోన్‌ వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లైంది. అవసరమైన సమాచారం సెకన్లలో కళ్లముందుకొస్తుంది. ముఖ్యంగా చిన్నారులు సోషల్‌ మీడియాలో వీడియోలు చూసి వాటిని అనుకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఐదుగురు పిల్లలు యూట్యూబ్‌ చూసి బాంబు తయారు చేయాలనుకున్నారు..

Youtube: వామ్మో.. యూట్యూబ్‌ చూసి బాంబు తయారుచేసిన పిల్లలు! కానీ అంతలోనే..
Children Make Bomb Using Youtube Tutorial
Srilakshmi C
|

Updated on: Aug 09, 2024 | 9:11 AM

Share

పాట్నా, ఆగస్టు 9: చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లైంది. అవసరమైన సమాచారం సెకన్లలో కళ్లముందుకొస్తుంది. ముఖ్యంగా చిన్నారులు సోషల్‌ మీడియాలో వీడియోలు చూసి వాటిని అనుకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఐదుగురు పిల్లలు యూట్యూబ్‌ చూసి బాంబు తయారు చేయాలనుకున్నారు. అందుకు అగ్గిపుల్లల నుంచి గన్‌పౌడర్‌ వరకు అన్నీ సేకరించి, ఓ టార్చిలైట్‌లో పోశారు. కానీ అదికాస్తా పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలోఐదుగురు పిల్లలు యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారు చేయాలనుకున్నారు. పిల్లలు అగ్గిపుల్లలు, గన్‌పౌడర్‌ను సేకరించి.. టార్చ్‌లైట్‌లో పోశారు. అనంతరం దానికి బ్యాటరీ వేసి, స్విచ్‌ ఆన్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భారీ పేలుడుతో అది పేలింది. ఈ దుర్ఘటనలో ఓ పిల్లాడికి తీవ్రగాయాలవ్వగా.. మిగిలిన నలుగురు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటీన గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యూట్యూబ్ వీడియో చూసి పిల్లలు ప్రభావితమయ్యారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ కుమార్ తెలిపారు. బాణసంచా సౌడర్‌, అగ్గిపుల్లల నుంచి గన్‌పౌడర్‌ని సేకరించి బాంబు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని టార్చ్‌లో పోశారని, ఈ క్రమంలో పెద్ద పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి మందుగుండు సామాగ్రి లభ్యం కాలేదని, అందుకే పేలుడు తీవ్రత ఎక్కువగా లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు పిల్లల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.